ఆంధ్రప్రదేశ్‌

ఓడించారన్న కోపంతోనే వద్దంటున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 19: సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు రెండుచోట్ల ఓడించారన్న కోపంతోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో రాజధాని వద్దంటున్నారా? అంటూ రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆయనకు సూటిప్రశ్న వేశారు. విశాఖ రుషికొండ బీచ్‌లో ఆదివారం మంత్రి బోటు షికారును పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నిజంగా అమరావతిపైనే పవన్‌కు ప్రేమ ఉంటే గాజువాక నుంచి ఎందుకు పోటీ చేశారన్నారు. బాబు ఆలోచనా విధానం బాగోలేనందున ప్రజలు ఓడించారన్నారు.
ప్రతిపక్ష నేతగా ఉండి మూడుసార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు అసెంబ్లీ ముట్టడికి పిలుపుఇవ్వడం బాధ్యతారాహిత్యంగా మంత్రి పేర్కొన్నారు. అసెంబ్లీ దేవాలయం వంటిదని, దీనిపై బాబుకు ఏమాత్రం గౌరవం లేదని విమర్శించారు. బాబు కమ్యునిస్టు నేతకాదన్నారు. వ్యవసాయం దండగ అన్న బాబు చెప్పేదొకటి, చేసేది మరొకటిగా పేర్కొన్నారు. కనీసం ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉన్నారంటే అది కేవలం ఉత్తరాంధ్ర ప్రజలు భిక్ష అని అన్నారు. సంపద సృష్టిస్తున్నామని చెబుతున్న ఆయన అమరావతిలో శాశ్వత నిర్మాణాలు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. హైదరాబాద్ మాదిరి మళ్ళీ అమరావతిని చెద్దామనే ఆలోచనతోనే బాబు అరాచకాలు సృష్టిస్తూ ప్రజల్ని రెచ్చగొడుతున్నారన్నారు. తమ ప్రభుత్వం మూడు ప్రాంతాలకు కట్టుబడి ఉందన్నారు. ఇచ్ఛాపురం నుంచి తడ వరకు పొడవునా ఉంది తప్పితే త్రిభుజాకారం, చతుర్భుజాకారంలో ఏపీ లేదన్నారు. ఉత్తరాంధ్రలో వర్షపాతం తక్కువని, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఉద్దేశ్యంగా పేర్కొన్నారు. పరిశ్రమలు వస్తే అభివృద్ధి జరుగుతుందని, రాష్ట్రం మరోపక్క ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. బాబు కుట్ర అర్ధం చేసుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పర్యాటక స్వర్గ్ధామం విశాఖ అని, అద్భుత పర్యాటక కేంద్రంగా ఇది అభివృద్ధి చెందుతోందన్నారు. దేశ, విదేశీ పర్యాటకులు ఆకర్షించే ఇక్కడ పర్యాటకంగా మరింతగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. గోదావరి నదిలో జరిగిన ప్రమాద సంఘటన తదుపరి విశాఖలో నిలిచిపోయిన బోటు
షికారును మళ్ళీ పునఃప్రారంభించామన్నారు. గోవాలో ప్రత్యేక శిక్షణ పొందిన డ్రైవర్లు మాత్రమే బోట్లను నడిపేందుకు అర్హులుగా ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను అధికారులు పటిష్టంగా అమలు చేయాలని, నింబధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆంధ్ర రాష్ట్రంలో 175బోట్లు ఉండగా, ఇందులో 110బోట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. వీటిని దశలవారీగా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పర్యాటకంగా విశాఖదే భవిష్యత్ అని అన్నారు. దేశ, విదేశాల పర్యాటకులు విశేషంగా ఆకర్షించే విధంగా ప్రాజెక్టులు అభివృద్ధి చెందుతున్నాయన్నారు.
'చిత్రం... బోటులో షికారు చేస్తున్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు