ఆంధ్రప్రదేశ్‌

ఇదే మా దేశం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 26: ఢిల్లీ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ సభ జరిగిన 36 గంటల వ్యవధిలోనే దీనికి పోటీగా అన్నట్లుగా బిజెపి ఆధ్వర్యంలో శనివారం ఉదయం జరిగిన జాతీయ సమైక్యత సభ ఎంతో ప్రశాంతంగా, విజయవంతంగా జరిగింది. కన్హయ్య సభలో ఉద్రిక్తకర వాతావరణం నెలకొనటం, జాతీయ జెండాను చూపినందుకు గాను బిజెపి కార్యకర్తపై దాడి జరిగిన నేపధ్యంలో స్థానిక బిజెపి నేతలు ఢిల్లీలో ఉన్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడితో మాట్లాడి కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే సభ ఏర్పాటు చేసినప్పటికీ వందల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలిరావటం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. జిల్లా నలుమూలల నుంచి జాతీయ జెండాలు చేతబూని సభా ప్రాంగణానికి తరలివచ్చారు. సభలో వెంకయ్యనాయుడు ప్రసంగం జరిగినంతసేపూ అడుగడుగునా ‘్భరత్ మాతాకీ జై’, ‘మాతరం మాతరం... వందేమాతరం’ అన్న నినాదాలు హోరెత్తాయి. సభా ప్రాంగణంపై భరతమాత, సుఖదేవ్, భగత్‌సింగ్, రాజ్‌గురు ఫోటోలను ఏర్పాటుచేసి నాయకులందరూ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ అమరవీరులకు అవమానం జరిగితే ఈ జాతి సహించదని హెచ్చరించారు. ముస్లిం మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ నాయకత్వంలో నగరానికి చెందిన పలువురు ముస్లింలు వేదికపై వెంకయ్యనాయుడు సమక్షంలో జాతీయ జెండాను పట్టుకుని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. ‘ఈ దేశంలో పుట్టాం, ఈ దేశంలో పెరుగుతున్నాం మేమంతా భరతమాత బిడ్డలమే’నంటూ నినాదాలు చేశారు. ఈ సభ విజయవంతం కావటంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇదే విధంగా సభలు నిర్వహించి కాంగ్రెస్, వామపక్షాలు సాగిస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని నాయకులు నిర్ణయించారు.

చిత్రం జాతీయ జెండా చేపట్టి భారత్‌మాతాకి జై’ అంటూ నినాదాలు చేస్తున్న ముస్లింలు