ఆంధ్రప్రదేశ్‌

లాఠీచార్జి, అరెస్ట్‌లతో అట్టుడికిన అమరావతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 20: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ, రాజధాని ప్రాంత 29 గ్రామాల ప్రజలు, రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఓ వైపు అమరావతి జేఏసి, వివిధ ఐకాసాలు, రాజకీయ పక్షాలు ఇచ్చిన అసెంబ్లీ ముట్టడి పిలుపుకు రాజధాని ప్రాంత వాసులు ఒక్కటయ్యారు. అసెంబ్లీ వద్ద పోలీసులు రైతులు, మహిళలపై లాఠీలను ప్రయోగించడంతో పలువురికి గాయాలయ్యాయన్న సమాచారాన్ని అందుకున్న ఆయా గ్రామాల ప్రజలు పోలీసుల ఆంక్షలను సైతం లెక్క చేయకుండా రహదారుల పైకి వచ్చి ఆందోళనలకు దిగారు. మందడంలో మహిళా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎదుట రహదారిని దిగ్బంధించి నిరసన వ్యక్తంచేశారు. మరోవైపు మంగళగిరి మండలం ఎర్రబాలెంలో సైతం మహిళలు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ, పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు, మహిళలకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి.
ఈ క్రమంలో ఎర్రబాలెంకు చెందిన భీమవరపు మల్లేశ్వరి అనే మహిళా రైతు స్మృహ కోల్పోయారు. వెంటనే సహచర మహిళలు ఆమెకు సపర్యలు చేసి ఇంటికి తీసుకువెళ్లారు. కృష్ణాయపాలెంలో రైతులు రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. తుళ్లూరులో సైతం భారీ ఎత్తున ప్రజలు రహదారులపైకి చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు తుళ్లూరు నుంచి వందలాది మంది రైతులు, మహిళలు అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఉదయం సమయంలో వెలగపూడిలో ఏపి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నల్లబెలూన్లతో నిరసన వ్యక్తంచేశారు. రాజధానిపై ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా అమరావతి విద్యార్థి, యువజన జేఏసి ఆధ్వర్యంలో నల్లబెలూన్లు ఎగురవేసి నిరసన తెలిపారు.
నిరసన తెలుపుతున్న నేతలను పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడలోని రైల్వే కల్యాణ మండపానికి తరలించారు. మందడంలో ఇళ్లపై నల్లజెండాలను ఎగురవేసి సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదాలతో కూడిన బోర్డులను ఇంటి గోడలకు వేలాడదీశారు. కాగా గుంటూరు పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ రైతులతో కలిసి అసెంబ్లీ ముట్టడికి యత్నించగా అసెంబ్లీ 2వ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రాజధాని గ్రామాల్లో అరెస్టయిన రైతులు, మహిళలు, జేఏసి నేతలను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి పోలీసుస్టేషన్ వద్ద కలుసుకుని పరామర్శించారు. మంత్రివర్గ నిర్ణయాన్ని శాసనమండలిలో తాము అడ్డుకుంటామని లోకేష్ పేర్కొన్నారు. రాజధాని కోసం రైతులు భూములు ఇస్తే వారిపై అన్యాయంగా లాఠీఛార్జ్ చేయడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం రాజధాని గ్రామాల్లో బంద్ నిర్వహించాలని రాజధాని రైతుల ఐక్య కార్యాచరణ సమితి నిర్ణయించింది. సోమవారం రాత్రి మందడంలో సమావేశమైన ఐకాసాలో ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రస్థాయిలో తప్పుబట్టారు.
''చిత్రాలు..వెలగపూడిలో రైతులను అడ్డుకుంటున్న పోలీసులు
*తుళ్లూరులో రైతుల ప్రదర్శనను అడ్డుకుంటున్న పోలీసులు