ఆంధ్రప్రదేశ్‌

అది చంద్రబాబు అమరావతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 20: రాజధాని పేరుతో కమ్మ వర్గం వారిని ప్రతిపక్షనేత చంద్రబాబు దగా చేస్తున్నారని పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) విమర్శించారు. అసలు అమరావతికి పాతరేసి కొత్తగా అమరావతిని సృష్టించారని అది చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే అన్నారు. కమ్మ కులస్థులు ఆయన్ను నమ్మి రోడ్డున పడవద్దని హితవు పలికారు. విశాఖపట్నంలో ఉన్న నోవాటెల్, దస్‌పల్లా హోటల్, డాల్ఫిన్ హోటళ్లతో పాటు లోకేష్ తోడల్లుడికి చెందిన గీతం యూనివర్శిటీ, ఇంకా 80 శాతం హోటళ్లు, 50 శాతం విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ఇతర వ్యాపారాలు కమ్మ వర్గం వారివే అన్నారు. పురంధ్రీశ్వరి, కంభంపాటి హరిబాబు రాజకీయంగా ఆ ప్రాంతం నుంచే ఎదిగారని గుర్తు చేశారు. ఏ వర్గం వారినైనా ఆదరించే నైజం విశాఖ ప్రాంత ప్రజలదని చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబునే కమ్మ వర్గం ఎక్కువగా విశ్వసిస్తుందని, ఆ బలహీనతతో స్వ ప్రయోజనాల కోసం రెచ్చకొట్టే ధోరణి అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధాని అమరావతిలోనే ఉంచాలని కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు జగన్‌ను బెదిరించాలని చంద్రబాబు కోరటం దౌర్భాగ్యమన్నారు. బెదరటానికి జగనేమీ చంద్రబాబు కాదన్నారు. ప్రజల్ని రెచ్చకొట్టి జోలెపడితే సానుభూతి రాదని విమర్శించారు. చంద్రబాబు విజన్ 2020 అంటే.. సోమవారం 20వ తేదీ చంద్రబాబు వెంట ఆయనతో పాటు 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారని అదే ఆయన విజన్ అని వ్యాఖ్యానించారు. ప్రజల్లో విశ్వసనీయత ఉంటే ఏవీ పనిచేయవన్నారు. జగన్ కులపిచ్చితో వ్యవహరిస్తే రాజధానిని రాయలసీమకు తరలించేవారని, అన్ని వర్గాలను ఆయన సమాదరిస్తారన్నారు. చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్ లేదన్నారు.

'చిత్రం...అసెంబ్లీలో మాట్లాడుతున్న మంత్రి కొడాలి నాని