ఆంధ్రప్రదేశ్‌

చైల్డ్ ఫ్రెండ్లీ స్టేట్‌గా ఏపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి కార్యక్రమం దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తుందని, విద్యారంగంలో సంస్కరణలు అద్భుత ఫలితాలనిస్తాయని నోబెల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యార్థి ప్రశంసించారు. మంగళవారం శాసనసభలోని సీఎం చాంబర్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఇరువురు చర్చించారు. ప్రధానంగా ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రస్తావనకు వచ్చాయి. వీటితో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామ సచివాలయాల వ్యవస్థ సంస్కరణలు అభివృద్ధికి సూచికలని సత్యార్థి స్పష్టం చేశారు. వలంటీర్ల వ్యవస్థ ప్రజలకు మరింత చేరువ కాగలదన్నారు. మహిళలకు ఆర్థిక చేయూతతో పాటు విద్యా ప్రమాణాల మెరుగుదలకు చేపట్టిన అమ్మఒడి అమలుతో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. విద్యారంగంలో
వినూత్న మార్పులు తీసుకు రావటం ద్వారా ‘చైల్డ్ ఫ్రెండ్లీ స్టేట్’గా ఏపీ గుర్తింపు పొందుతుందని చెప్పారు. కుల, మత, సాంఘిక వివక్షత లేకుండా పేదలందరికీ ఉన్నత విద్య అందుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కచ్చితంగా పిల్లలు మంచి విద్య పొందే అవకాశాలు ఉన్న రాష్ట్రంగా మారగలదన్నారు. ముఖ్యమంత్రి జగన్ సారధ్యంలో ప్రతి చిన్నారి ఆనంద మయ జీవనాన్ని గడుపుతారని అభిలషించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ సంస్థ తరుపున సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని ప్రకటించారు.

'చిత్రం... ముఖ్యమంత్రిని కలిసిన కైలాష్ సత్యార్థి, పక్కన ఎంపీ లావు కృష్ణదేవరాయలు