ఆంధ్రప్రదేశ్‌

స్పీకర్ ఆగ్రహం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: శాసనసభ చరిత్రలోనే తొలిసారిగా స్పీకర్ తమ్మినేని సీతారాం ఎవరూ ఊహించని రీతిలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రేకానికి లోనై టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన ఇయర్ ఫొన్, కోటులోనున్న మైక్‌ను బల్లపై విసిరి సభ నుంచి నిష్కమించారు. దీంతో సభ్యులందరూ అవాక్కయ్యారు. గతంలో శాసనమండలిలో తిరస్కరించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ బిల్లు మంగళవారం రెండోసారిగా అసెంబ్లీలో చర్చకు వచ్చింది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దాదాపు మూడు గంటలపాటు అదీ బిల్లు ఆమోదం పొందే వరకు టీడీపీకి చెందిన 15 మంది సభ్యులు స్పీకర్ పోడియం పైకి వెళ్లటమే కాకండా ఆయన సీటును చుట్టుముట్టారు. అయినప్పటికీ స్పీకర్ సీతారాం ఎంతో ఓర్పుతో వారిని ఏ మాత్రం పట్టించుకోకుండానే అధికారపక్ష సభ్యులతో మాట్లాడించడం ప్రారంభించారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరి కొందరు నిలబడలేక పోడియం మెట్లపైనే చతికిలపడ్డారు. ఒకే రాష్ట్రం... ఒకే రాజధాని అదీ అమరావతి అంటూ ఫ్లకార్డులు చేతబూని మూడు గంటలపాటు నినాదాలు చేశారు. కొందరు సభ్యులు కెమెరాలకు అడ్డుగా నిలిచారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యులు తీవ్ర స్థాయిలో రాయటానికి వీలులేని పదచాలంతో దుర్భాషలాడుకున్నారు. అరేయ్.. ఓరేయ్ అంటూ సంబోధించుకున్నారు. స్పీకర్ బీసీ వర్గానికి చెందిన వారు కాబట్టే ప్రతి రోజూ ఆయన సీటును అగౌరవపరుస్తూ కించపరుస్తున్నారని ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలు దురమయ్యారు.. ఇక బీసీలు కూడా దూరమవుతారని చంద్రబాబుతో సహా టీడీపీ తరపున ఏ ఒక్కరూ భవిష్యత్‌లో ఈ సభలోకి అడుగుపెట్టబోరంటూ కేకలు వేశారు. మధ్యమధ్య టీడీపీ సభ్యులు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. సీఎం జగన్ మాట్లాడే సమయంలో
టీడీపీ సభ్యులు ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌ల నుంచి రూ. 1600 కోట్లు అమ్మఒడికి దారిమళ్లించారంటూ నినదించారు. ఈ దశలో సహనం కోల్పోయిన స్పీకర్‌కు కోపం వచ్చింది. టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తూ తాను తీవ్ర మనస్తాపానికి గురువుతున్నానంటూ... ఇయర్ ఫొన్, మైక్‌లను టేబుల్‌పై పడేసి సభ నుంచి నిష్కమించారు. ఈ హఠాత్ పరిణామంతో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హుటాహుటిన స్పీకర్ చాంబర్‌లోకి వెళ్లి దాదాపు గంటసేపు సముదాయింప చేయగా అనంతరం తిరిగి సభలోకి అడుగుపెట్టారు.
ముందుగా సభలోకి వచ్చిన సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం సభ్యులను ఉద్దేశించి గుడ్‌మార్నింగ్ చెప్పారు. రాజధాని తరలింపునకు నిరసనగా టీడీపీ సభ్యులు స్పీకర్‌కు బ్యాడ్ మార్నింగ్ అంటూ బదులిచ్చారు. అందుకు స్పందించిన స్పీకర్ తమ సీఎం ఎప్పుడూ చెబుతుంటారని, కుక్కతోక ఎప్పుడూ వంకరేనని కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు ఎవరైనా తెల్లవారి లేచి శుభోదయం అంటారని లేకపోతే గుడ్ మార్నింగ్ అంటారని స్పీకర్ వ్యాఖ్యానించారు. ‘మీ ఖర్మ..బ్యాడ్ మార్నింగ్’ అని టీడీపీ సభ్యులను ఉద్దేశించి స్పీకర్ బదులిచ్చారు.