ఆంధ్రప్రదేశ్‌

ఎంత ప్రేమో..కదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 21: దాదాపు 200 ఏళ్ల చరిత్ర కల్గిన అమరావతిలో గడచిన ఐదేళ్లలో అభివృద్ధి అనేది ఎలా ఉన్నప్పటికీ కనీసం ఒక చెంచాడు ఇసుక, సిమెంట్ పడలేదు. 2014 డిసెంబర్‌లో ఏపీకి అమరావతి రాజధాని అనే ప్రకటన వెలువడినందునే పాపం ఆ కుగ్రామంలోని ప్రజలు అప్పోసొప్పో చేసి తమతమ ఇళ్ల స్థలాలకు విలువ పెరుగకపోతుందా? అలాగే అద్దెలు రాకపోతాయా? అన్న ఆశలతో ఒక్కసారిగా రేకుల షెడ్ల స్థానంలో డాబాలు.. డాబాల స్థానంలో ఒకటి, రెండస్తుల భవనాలు ఏర్పాడ్డాయి. దీనికి తోడు నాటి కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రత్యేక శ్రద్ధతో కేంద్రంచే అమరావతి గ్రామాన్ని వారసత్వ నగరంగా కేంద్రంచే ప్రకటింపచేసి దాదాపు రూ. 30 కోట్ల వరకు నిధులు కేటాయింపచేశారు. వెంకయ్య నాయుడు స్వయంగా నాటి సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి 2015 డిసెంబర్ ఐదో తేదీన ఆ గ్రామానికి వెళ్లి శిలాఫలకంను కూడా ప్రారంభించారు. ఆ తర్వాత చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలోను ఒక్కసారి మాత్రమే అమరావతి గ్రామాన్ని సందర్శించారు. ఆ రెండు సార్లు బాబు ఆ గ్రామంలోని అత్యంత ప్రాముఖ్యత కల్గిన అమరేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోకి మాత్రం అడుగిడలేదు. అది వేరే విషయం. ఇక ఇదే సమయంలో ఆ గ్రామ పరిసరాల్లో భూముల విలువ నింగిని తాకింది. అదీ కొద్ది మాసాల పాటే. ఇక అమరావతి గ్రామాన్ని నగర పంచాయతీగా వచ్చిన ప్రతిపాదనను సైతం తుంగలో తొక్కారు. ఇదిలా ఉంటే అదే సమయంలో ఆ గ్రామ పరిసరాల్లో 150 ఎకరాల ప్రభుత్వ భూముల్లో హైకోర్టును ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు పరిసరాల్లో భూముల విలువలు మరింతగా పెరిగాయి. అయితే ఏమి జరిగింది? కృత్రిమ అమరావతి నగరాన్ని లక్షల వేల కోట్లతో అభివృద్ధి చేయాలంటూ దాదాపు ఆరువేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మరో రూ. 16వేల కోట్లకు టెండర్లు పిలిచారు. కాని అసలు అమరావతి గ్రామాల వైపు నేటికీ తొంగిచూసిన నాథుడే లేడు. రాజా వాసిరెడ్డి వెంకట్రాది నాయుడు 200 ఏళ్ల క్రితం అమరావతిని రాజధానిగా చేసుకుని రాజ్యమేలారు. అలాగే గౌతమబుద్ధుడు తిరిగాడిన నేలయది. తొలిసారిగా 2006 సంవత్సరం నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించి కాలచక్రం ఉత్సవాలు నిర్వహించారు. అనేక దేశాల నుంచి బౌద్ధ మతస్థులు, గురువులు వేలాది మంది తరలివచ్చారు. అన్నింటి మంచి మత పెద్ద దలైలామా ఆ గ్రామంలో 15 రోజులపాటు బస చేశారు. తొలిసారిగా ఈ కాలచక్రతో అమరావతి చరిత్రపుటల్లోకి ఎక్కింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం చట్టసభల్లో కృత్రిమ అమరావతి నగరం పైన అలజడి వేగుతుంటే...వికేంద్రీకరణ పేరిట సీఎం జగన్ ఆ అమరావతి ప్రాంతాన్ని లెజిస్లేచర్ నగరంగా ఉంచుతామంటూ తాను నివసించే తాడేపల్లితోపాటు మంగళగిరి మున్సిపాల్టీలను రాష్ట్రంలోనే కనీవినీ ఎరుగని రీతిలో మోడల్ మున్సిపాల్టీలుగా తీర్చిదిద్దుతామన్నారు. అయితే ఇదే సమయంలో గత ఐదేళ్లలో చంద్రబాబు ఏ మాత్రం పట్టించుకోకపోయినా కనీసం జగన్ అయినా ఆ గ్రామాన్ని నగర పంచాయతీగా ప్రకటించి కాస్తంత అభివృద్ధి చేయాలని ఆ ప్రాంత ప్రజలు ఆకాంక్షించారు.