ఆంధ్రప్రదేశ్‌

విద్యుత్ ఇంజనీర్ల డైరీ ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 21: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2020 సంవత్సరపు డైరీ, క్యాలండర్‌ను మంగళవారం ఇంధనశాఖ కార్యదర్శి, ట్రాన్స్‌కో సీఎండీ నాగులాపల్లి శ్రీకాంత్ ఆవిష్కరించారు. విజయవాడ పరిణయ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ట్రాన్స్‌కో జేఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబు, ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పద్మ జనార్ధన్‌రెడ్డి, ఏపీ ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్, సీపీడీసీఎల్‌కు చెందిన పలువురు చీఫ్ ఇంజనీర్లు హాజరయ్యారు. అసోసియేషన్ అధ్యక్షులు బీ వంశీ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎన్ లక్ష్మణరావు శాఖాపరమైన అంశాలపై ప్రసంగించారు. ట్రాన్స్‌కో, జెన్‌కోలో ఖాళీ పోస్టుల భర్తీ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల నియామకాలు, రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ అమ్మకం, కాల పరిమితి పదోన్నతులను ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. ఈపీఎఫ్, జీపీఎఫ్‌తో పాటు రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీ ఉద్యోగుల విభజన తదితర అంశాలపై చర్చించారు.
'చిత్రం...డైరీ ఆవిష్కరిస్తున్న ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్