ఆంధ్రప్రదేశ్‌

టీడీపీ సభ్యుల తీరుపై అథెక్స్ కమిటీకి సిఫార్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (పటమట) జనవరి 22: శాసనసభలో బుధవారం ప్రతిపక్ష టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరుపై అథిక్స్ కమిటీకి స్పీకర్ తమ్మినేని సీతారాం సిఫార్స్ చేశారు. రైతు భరోసా కేంద్రాలపై చర్చ సందర్భంగా అధికారపక్ష సభ్యులు మాట్లాడుతుండగా ప్రతిపక్ష టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టముట్టి జై అమరావతి.. జై జై అమరావతి అంటూ నినాదాలు చేయటంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొని, తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టముట్టటమేకాక, కొంత మంది సభ్యులు స్పీకర్ కుర్చీ పక్కనే కూర్చుని ఉండగా మరి కొంత మంది సభ్యులు నినాదాలు చేస్తూ సీఎం జగన్‌పై, స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయటంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం, ఉద్రిక్త వాతావారణం చోటు చేసుకొంది. అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి
దిగటంతో రెండుగంటల పాటు సభ రసాభాసగా మారింది. ఒక దశలో సభలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్ష సభ్యులను సీటుల్లోకి వెళ్లి కూర్చోవాలని స్పీకర్ తమ్మినేని పదే పదే విజ్ఞప్తి చేసినా పోడియంను వదలకుండా నినాదాలు చేస్తూనే ఉండటంతో మార్షల్స్‌ను పిలిపించి టీడీపీ సభ్యులను బయటకు పంపించాలని ఆదేశించారు. దీంతో టీడీపీ సభ్యులు తమకు మాట్లాడానికి మైక్ ఇవ్వలేదని ఆరోపిస్తూ వాకాట్ చేసి సభ నుండి బయటకు వెళ్లిపోయారు. సీఎం జగన్, స్పీకర్‌పై అనుచిత వాఖ్యలు చేసిన ప్రతిపక్ష టీడీపీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకున్న తరువాతే శాసనసభ నిర్వహించాలని అధికారపక్ష సభ్యులు పట్టుబడటంతో టీడీపీ సభ్యుల ప్రవర్తించిన తీరుపై స్పీకర్ అథిక్స్ కమిటీకి సిఫార్స్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఈ సందర్భంగా సభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ సభలో ప్రతిపక్ష సభ్యులు ప్రవర్తించిన తీరు ఆక్షేపణీయంగా ఉందన్నారు. ఇలాంటి సంఘటనలు సభలో చోటుచేసుకోవటం దురదుష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు సభాసంప్రదాయాలను ఉల్లంఘించటం సరైంది కాదన్నారు. ప్రజాస్వామ్యంలో స్పీకర్ వ్యవస్థకు ఉన్నతమైన స్థానం ఉందని, అటువంటి స్పీకర్ స్థానాన్ని అగౌరపర్చటం మంచి పద్ధతి కాదన్నారు. ప్రతిపక్ష సభ్యులు రెండు గంటలపాటు సభలో గందరగోళం సృష్టిస్తున్నా చాలా సహనంతో, ఓపికతో వ్యవహరించానని, అయినా ప్రతిపక్ష సభ్యులు వినకుండా గంటన్నరపాటు ఏకధాటిగా నినాదాలు చేయటం తగదని హితవు పలికారు. ప్రతిపక్ష సభ్యులకు కూడా సభలో మాట్లాడానికి అవకాశం కల్పిస్తానని చెప్పినా వారు వినకుండా ముందస్తు పథకం ప్రకారమే సభలో గందరగోళం సృష్టించటానికి వచ్చినట్లుగా ఉందని స్పష్టం చేశారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయటం వారి విజ్ఞతకే వదిలివేస్తున్నానన్నారు. తాను బలహీన వర్గాలకు చెందిన వ్యక్తినే కానీ.. బలహీనుడిని మాత్రం కాదని స్పష్టం చేశారు. ప్రతిపక్ష సభ్యుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల నిర్ణయం ప్రభుత్వ నిర్ణయమని, మంచి, చెడు తరువాత ప్రజలే నిర్ణయిస్తారని ఆయన స్పష్టం చేశారు.
'చిత్రం... సభాపతి తమ్మినేని సీతారాం