ఆంధ్రప్రదేశ్‌

ఇది బ్లాక్ డే, నీతిమాలిన చర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 22: రాష్ట్ర చరిత్రలో ఇది దుర్దినం (బ్లాక్‌డే) అని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో ఆమోదం పొందిన రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపించాలని మండలి చైర్మన్ షరీఫ్ అడ్డగోలు నిర్ణయం తీసుకోవటం నీతిమాలిన చర్య అని ఖండించారు. మండలి వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన మండలి చైర్మన్ షరీఫ్ చరిత్ర హీనులుగా మిగిలిపోతారని మండిపడ్డారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంతో ప్రభుత్వం బిల్లులు ప్రవేశ పెట్టిందన్నారు. అమరావతి పేరుతో చంద్రబాబు దోపిడీని కొనసాగించేందుకే అడ్డుకున్నారని ఆరోపించారు. గత రెండు రోజులుగా మండలిలో నాన్చుడు ధోరణి వల్ల రాష్ట్ర ప్రజలంతా ఇబ్బందులకు గురయ్యారని దీనిపై టీడీపీ నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 13 జిల్లాల సమగ్ర అభివృద్ధికి చైర్మన్ చర్య విఘాతం కలిగిస్తోందని ధ్వజమెత్తారు. భవిష్యత్‌లో చట్టసభల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కారాదన్నారు. బిల్లుల ఆమోదం విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని విలేఖర్లు ప్రస్తావించగా ఇప్పుడే చెప్పలేమని దాటవేశారు. కేబినెట్ సమావేశం నిర్వహించి మండలిని రద్దు చేస్తారని, ఆర్డినెన్స్ తెస్తారనే ప్రచారంపై స్పందిస్తూ మండలి స్పీకర్ చర్యలు, సెలక్ట్ కమిటీ అంశాలను పరిశీలించిన తరువాతే నిర్ణయం ఉంటుందన్నారు. గత కొద్ది రోజులుగా రాజధాని రైతులను అడ్డు పెట్టుకుని చంద్రబాబు ఆందోళనతో అలజడి సృష్టించారని, రాష్ట్రంలో అశాంతిని ప్రేరేపించారని దుయ్యబట్టారు.
సీఆర్‌డీఏ రద్దు బిల్లుకు సంబంధించి మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ప్రాంతీయ అసమానతలు తొలగించేందుకే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామన్నారు. రైతుల నుంచి 40,921 అర్జీలు వచ్చాయన్నారు. సమాన అభివృద్ధి సమస్యలకు పరిష్కారమన్నారు.