రాష్ట్రీయం

డంపింగ్ కాలుష్యంపై ఎన్‌జీటీ సభ్యుల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తీసిన మట్టి డంపింగ్ కారణంగా కాలుష్య ముప్పు ఏర్పడిందని వచ్చిన ఫిర్యాదు మేరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) సభ్యులు సి పాల్ పాండే, ఎం మధుసూదన్ బుధవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పర్యటించారు. మట్టి డంపింగ్ కారణంగా కాలుష్యం ముప్పు వస్తోందని ఆర్థికవేత్త పెంటపాటి పుల్లారావు చేసిన ఫిర్యాదు మేరకు వారు పర్యటించారు. ముందుగా మట్టి డంపింగ్ ప్రాంతానికి చేరుకున్న వారికి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు స్వాగతం పలికారు. డంపింగ్ యార్డును పరిశీలించిన అనంతరం ఇంజినీరింగ్ కార్యాలయానికి చేరుకున్న వారు రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారుల సమావేశంలో మాట్లాడారు. వివిధ అంశాలను అడిగి తెలుసుకున్నారు. డంపింగ్‌కి సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించారు. పోలవరం భూ సేకరణ ప్రత్యేక కలెక్టర్ ఈ మురళి, జంగారెడ్డిగూడెం ఆర్డీవో వై ప్రసన్నలక్ష్మి, ఈఈ మల్లికార్జునరావు, పోలవరం డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు, తహసీల్దారు నరసింహమూర్తి, ఎస్సై ఆర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
'చిత్రం... కాఫర్ డ్యాం నిర్మాణ వివరాలు తెలుసుకుంటున్న గ్రీన్ ట్రిబ్యునల్ సభ్యులు