ఆంధ్రప్రదేశ్‌

ప్రతిష్టాత్మకంగా గణతంత్ర వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 22: గణతంత్ర వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు. బుధవారం సచివాలయంలో ఈ విషయమై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో ఈనెల 26న విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వేడుకల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మంత్రులు, ఇతర ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు. వేడుకలను వీక్షించేందుకు వచ్చే ప్రజలకు తగిన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, పోలీస్, ఎన్‌సీసీ తదితర విభాగాలు నిర్వహించే కవాతు ప్రదర్శనకు సంబంధించి రిహార్సిల్స్‌ను ఈనెల 24లోగా పూర్తి చేయాలన్నారు. వేడుకలు తిలకించేందుకు వచ్చే విద్యార్థులు, ప్రజలకు తాగునీరు, టాయిలెట్లు, సీటింగ్ వంటి ఏర్పాట్లు సక్రమంగా ఉండాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ముఖ్యంగా నవరత్నాలు ప్రతిబింబించే రీతిలో వివిధ శకటాల ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గణతంత్ర వేడుకల నిర్వహణపై శాఖల వారీ చర్యలను అడిగి తెలుసుకున్నారు. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ 26న ఐజీఎం స్టేడియంలో ఏర్పాటయ్యే వేడుకల వివరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఉదయం 9 గంటల నుండి వేడుకలు ప్రారంభమవుతాయని చెప్పారు. కృష్ణా జిల్లా కలెక్టర్ ఎ మహమ్మద్ ఇంతియాజ్ మాట్లాడుతూ గణతంత్ర వేడుకల నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి వివిధ శాఖల అధికారులను సమన్వయం చేస్తూ పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు, విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యేలా చూడాలన్నారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ స్టేడియంలో వేడుకల సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ప్రాంతాలు, బందోబస్తు చర్యలను వివరించారు. మునిసిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ స్టేడియం ప్రాంగణంతో పాటు నగరంలో వసతి కల్పిస్తున్న 9 ప్రాంతాల్లో తాగునీరు, టాయిలెట్ల వసతి కల్పిస్తామని తెలిపారు. నిరంతర పారిశుద్ధ్య చర్యలు చేపడతామన్నారు. రాష్ట్ర సమాచారశాఖ కమిషనర్ టీ విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ వేడుకలను తిలకించేందుకు వచ్చే అందరికీ సదుపాయాలు కల్పించాలని స్టేడియం ప్రాంగణంలో మూడు ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పటిష్టమైన ఆడియో సిస్టమ్ సిద్ధంగా ఉంచామన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించి వివిధ శాఖలకు చెందిన 14 శకటాలను ప్రదర్శనకు గుర్తించామని వివరించారు. ముఖ్య అతిధి సందేశం సిద్ధం చేయటంతో పాటు తెలుగు, ఆంగ్ల భాషల్లో వేడుకల వివరాలను తెలిపే కామెంటేటర్లను నియమిస్తామన్నారు. ఆర్ అండ్ బీ, ట్రాన్స్‌కో, వైద్య, ఆరోగ్యశాఖ, ఉద్యానవన, రవాణా, అగ్నిమాపక, ఎపీఎస్పీ విభాగం అధికారులు వారి ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలను సీఎస్‌కు వివరించారు. సమావేశానికి అగ్నిమాపక విభాగం డైరెక్టర్ జనరల్ ఏఆర్ అనూరాధ, శాంతిభద్రతల అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, గవర్నర్ కార్యదర్శి ముఖేశ్‌కుమార్ మీనా, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి ఎం రవిచంద్ర, ఏపీఎస్పీ, సీఆర్‌పీఎఫ్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
'చిత్రం... అధికారులతో సమీక్షిస్తున్న సీఎస్ నీలం సాహ్ని