ఆంధ్రప్రదేశ్‌

వౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 22: దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ పనులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆదేశించారు. ఈ విషయమై బుధవారం ఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ రహదారుల విస్తరణ, పెట్రోలియం పైపులైన్ ప్రాజెక్ట్‌ల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాజెక్ట్‌లకు అవసరమైన భూ సేకరణ జరిపి సకాలంలో పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్క్ సిస్టం (సీసీటీఎన్‌ఎస్) కింద వివిధ పోలీస్ రికార్డుల కంప్యూటరీకరణ, పోలీస్ సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచే అంశంపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాల వారీగా ప్రగతి అంశానికి సంబంధించిన ప్రాజెక్ట్‌ల ప్రగతిని ఈ సందర్భంగా ప్రధాని సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదుగా వెళుతున్న పారాదీప్- హైదరాబాద్ పెట్రోలియం పైపులైన్ల నిర్మాణ పనులు, బళ్లారి- బయరాపూర్ జాతీయ రహదారి నిర్మాణానికి భూ సేకరణ ప్రక్రియ, సీసీటీఎన్‌ఎస్‌పై ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నీలం సాహ్నితో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ రాష్ట్రం మీదుగా వెళుతున్న బళ్లారి- బయరాపూర్ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ పనుల్లో పురోగతిని ప్రధానికి వివరించారు. భూ సేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల వలవన్, సర్వీసెస్ శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.