ఆంధ్రప్రదేశ్‌

రాజధాని పరిధిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 23: రాజధాని అమరావతి పరిధిలో భూముల క్రయ విక్రయాలలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని, దీనిపై పూర్తి ఆధారాలతో కేసు నమోదు చేసినట్లు సీఐడీ ఎస్‌పీ మేరీప్రశాంతి పేర్కొన్నారు. గురువారం మంగళగిరి పట్టణ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఎస్‌పీ మాట్లాడుతూ తమను మభ్యపెట్టి తన భూమిని కొనుగోలు చేశారని వెంకటాయపాలెం దళిత మహిళ పోతురాజు బుజ్జి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు
నమోదు చేశామన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే మాజీ మంత్రులపై 420, 506, 120బి, ఐపిసి సెక్షన్ 3 కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. భూముల కొనుగోళ్ల విషయంలో మాజీ మంత్రులు పి నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, మరో వ్యక్తి బెల్లంకొండ నరసింహారావులపై బుజ్జి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదు చేశామన్నారు. తమ విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. 797 మంది తెల్లరేషన్ కార్డుదారులు రాజధాని అమరావతి పరిధిలో భూములు కొనుగోలు చేసి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినట్లు నిర్ధారణైందన్నారు. ఎకరం రూ.3 కోట్ల చొప్పున తెల్లరేషన్ కార్డుదారులు కొనుగోలు చేశారని, దాదాపు ఈ రకంగా రూ.220 కోట్లు వెచ్చించి భూములు కొనుగోలు చేశారన్నారు. అమరావతిలో 131 మంది తెల్లరేషన్ కార్డుదారులు 129 ఎకరాలు, పెదకాకానిలో 40 ఎకరాలను 43 మంది, తాడికొండలో 190 ఎకరాలను 188 మంది, తుళ్లూరులో 238 మంది 242 ఎకరాలను, మంగళగిరిలో 148 మంది 133 ఎకరాలను, తాడేపల్లిలో 49 మంది తెల్లరేషన్ కార్డుదారులు 24 ఎకరాల చొప్పున కొనుగోలు చేసినట్లు తమ దర్యాప్తుల్లో వెల్లడైందని సిఐడి ఎస్‌పి మేరీప్రశాంతి వివరించారు.

'చిత్రం... విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌పీ మేరీ ప్రశాంతి