ఆంధ్రప్రదేశ్‌

మండలి పరిణామాలపై మంత్రుల మండిపాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్ర శాసన మండలిలో బుధవారం జరిగిన పరిణామాలపై శాసనసభలో పలువురు మంత్రులు మండిపడ్డారు. తాము ఎమ్మెల్సీలమైనప్పటికీ మండలిని రద్దు చేయాలని కోరుతున్నట్లు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ స్పష్టం చేశారు. శాసన మండలిలో జరిగిన పరిణామాలపై గురువారం అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ చర్చను చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రతిపాదించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చర్చను ప్రారంభిస్తూ ఎక్కడా లేని విధంగా కౌన్సిల్ నిబంధనల్లో 71వ రూల్‌ను తీసుకువచ్చారని తెలిపారు. ప్రభుత్వ బిజినెస్‌కు ప్రాధాన్యత ఇవ్వమన్నా, రూల్ 71 కింద చర్చ జరిపారన్నారు. కుట్ర పూరితంగా 71 రూల్‌ను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. గురువారం ఉదయం మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు తనతో మాట్లాడుతూ ఈ రెండు బిల్లులకు సవరణలు ఇస్తున్నామని, సహకరించమని కోరారని గుర్తు చేశారు. రెండు బిల్లును మండలిలో పరిగణలోకి తీసుకున్న వెంటనే సెలక్ట్ కమిటీకి పంపేందుకు సవరణలను సభలో ప్రతిపాదించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతిపాదించాకే చర్చ జరగాలని తెలిపారు. 154 నిబంధన కింద విచక్షణ అనేది బిల్లులు, సవరణలు వంటివి ప్రవేశపెట్టే సమయం మార్చేందుకు ఉంటుందని, కానీ సెలక్ట్ కమిటీ రిఫర్ చేయడం గురించి కాదని స్పష్టం చేశారు. బలం ఉంది కదా అని ఏ నిబంధనను అయినా తమకు అనుకూలంగా మార్చుకోవచ్చన్నట్లుగా ప్రవర్తిస్తున్నారన్నారు. మండలి చైర్‌ని ప్రభావితం చేస్తున్నట్లు కనబడుతోందన్నారు. నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పుడు విచక్షణ అనేది ఉండదని, అసెంబ్లీకి సహరించేందుకు పెద్దల సభ ఏర్పాటు చేశారని, శాసన కార్యకలాపాలను అడ్డుకునేందుకు కాదన్నారు. చైర్మన్‌ను ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రభావితం చేయడం పెద్ద తప్పు అని అన్నారు. చట్టాల రూపకల్పనను అడ్డుకోవడాన్ని ప్రశ్నించాల్సిందేనని తెలిపారు. మద్యం తాగి మంత్రులు సభకు వచ్చారన్న యనమల వ్యాఖ్యలపై ప్రివిలైజ్ కమిటీకి ఫిర్యాదు చేయాలన్నారు. చైర్మన్ తీరు బాధాకరమని, జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపారు. చంద్రబాబును చూసి, సెలక్ట్ కమిటీకి రిఫర్ చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారన్నారు. మండలికి ఎన్నడూ రాని చంద్రబాబు నాలుగు గంటల పాటు గ్యాలరీలో కూర్చోవాల్సిన అవసరమేమిటని ప్రశ్నించారు. మండలి నిర్వహణకు రోజుకు 15 లక్షల రూపాయల చొప్పున ఏటా 60 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. చైర్మన్‌ను చంద్రబాబు ప్రభావితం చేయడం దారుణమన్నారు.
రాష్ట్ర వ్యవసాయ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్రంలో ఉండటం ప్రజలు ఏనాడో చేసిన పాపమని వ్యాఖ్యానించారు. నిబంధన 71 కింద చర్చపై హైడ్రామా సృష్టించారని ఆరోపించారు. నాలుగు గంటల పాటు గ్యాలరీలో చంద్రబాబు కూర్చుని చైర్మన్ ప్రభావితం చేసేందుకు పడిన తపన, వేదన చూశామన్నారు. రూల్స్‌ను పక్కన పెట్టి నిర్ణయం తీసుకున్నారని, కొత్త సంప్రదాయానికి తెరతీశారన్నారు. లోకేష్, యనమల, చంద్రబాబు కలిసి డ్రామా ఆడారన్నారు. పార్లమెంటరీ కార్యకలాపాల్లో మార్పులు తీసుకురావాలని కేంద్రానికి సిఫారసు చేయాలన్నారు. చైర్మన్ గంభీరంగా మాట్లాడుతున్నారంటే రాజీనామా చేస్తారని ప్రకటిస్తారనుకున్నామని, కానీ ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించారని ఆరోపించారు. మంత్రులను కించ పరస్తూ చేసిన వ్యాఖ్యలపై కూడా పిలిచి మాట్లాడాలన్నారు. శాసన వ్యవస్థలో కొత్త విధానాలను రూపొందించి దేశం దృష్టికి తీసుకురావాలన్నారు. శాసన మండలిలో జరుగుతున్న పరిణామాలపై మండలి అవసరమా అన్న చర్చ ప్రారంభమైందన్నారు. స్పీకర్ హోదాలో ఒక పార్టీకి సహకరించిన రోజును ఎల్లోడేగా చెప్పాలన్నారు. బిల్లును ఆపగలిగారు కానీ ప్రజల మనోభావాలను ప్రభావితం చేయలేరన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనల్లో ప్రజలు నిస్సహాయులుగా ఉండకూడదని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఇది ప్రజల తీర్పును అవమానించినట్లేనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే వైపు దారితీసేలా వెళ్తోందా అన్న అంశాన్ని చర్చించాలన్నారు. ఈ వ్యవహారాలపై విస్తృత చర్చ జరగాలన్నారు. ప్రజల్లో గెలవలేని వారు అడ్డగోలు నిర్ణయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి మండలి అవసరమా అన్న అంశం ప్రజాస్వామ్యవాదులంతా ఆలోచించాలన్నారు. దీనిపై చర్చ జరగాలన్నారు. మంత్రి మోపిదేవి వెంకట రమణ మాట్లాడుతూ శాసన మండలి రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెట్టే సభ కొనసాగడంపై ఆలోచించాలన్నారు. తాను ఎమ్మెల్సీ అయినా మండలి రద్దు అంశాన్ని పరిశీలించాలన్నారు. బిల్లులను రాజకీయ కోణంలో తిరస్కరించడం సరికాదన్నారు. తాను ఎమ్మెల్సీ అయినప్పటికీ ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తానన్నారు. మండలి ఉండాలా వద్దా అన్న అంశంపై చర్చ జరగాలని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తానూ ఎమ్మెల్సీనేనని , అయినా మండలిని రద్దు చ చేయాలని కోరుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. సభాపతే చట్టాలను అతిక్రమిస్తే ఎవరితో చెప్పుకోవాలని ప్రశ్నించారు.