ఆంధ్రప్రదేశ్‌

యువతకు స్ఫూర్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 23: అంతర్జాతీయ స్థాయిలో భారత స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపించి నాడు ఎంతో మంది యువత స్వాతంత్య్ర ఉద్యమంలో చేరడానికి ప్రేరణగా నిలిచిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిరస్మరణీయుడని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడ రాజ్‌భవన్ దర్బార్ హాలులో గురువారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ 123వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగర ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ తొలుత నేతాజీ చిత్రపటానికి పూలమాలలు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రం కటక్‌లోని నేతాజీ జన్మస్థలాన్ని తాను చాలాసార్లు సందర్శించగలిగినందుకు గర్వపడుతున్నానన్నారు. తన విద్యాభ్యాసం కటక్‌లోనే సాగిందని, అక్కడి నుంచే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించానని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే పలుమార్లు నేతాజీ జన్మస్థలాన్ని సందర్శించి ఆయనకు నివాళులర్పించానని వివరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, సంయుక్త కార్యదర్శి అర్జునరావు, రాజ్‌భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మాజీ మేయర్ జంధ్యాల శంకర్, సీనియర్ జర్నలిస్ట్ తుర్లపాటి కుటుంబరావు, సంపాదకుడు వేమూరి బలరాం, ప్రముఖ పారిశ్రామిక వేత్త ముత్తవరపు మురళీ, పురావస్తు నిపుణుడు ఈమని శివనాగిరెడ్డి నగరంలోని పలువురు ప్రముఖులు గవర్నర్ బిశ్వభూషణ్‌తో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొని నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు నివాళులర్పించారు.
'చిత్రం...గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఘన నివాళి