ఆంధ్రప్రదేశ్‌

జగన్ దెబ్బకు బాబు గ్యాలరీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 23: ఒక రకంగా ఎమ్మెల్సీ, టీడీపీ నేత నారా లోకేష్‌కు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి అంటూ రాష్ట్ర మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. శాసన మండలిలో జరిగిన పరిణామాలపై రాష్ట్ర అసెంబ్లీలో గురువారం జరిగిన చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ హయంలో రద్దు అయిన మండలిని వైఎస్ రాజశేఖర రెడ్డి మళ్లీ పునరుద్ధరించారని గుర్తు చేశారు. మండలిని వైఎస్ తిరిగి ఏర్పాటు చేయకపోతే లోకేష్ ఎమ్మెల్సీ అయ్యేవారా అంటూ వ్యాఖ్యానించారు. మంత్రిగా రెండు సభల్లో తిరిగేవారా? అని చమత్కరించారు.
150 కిలో బరువు ఉంటే పెద్దాయన అని, అది పెద్దల సభ అని టీడీపీ నేతలు అనుకుంటున్నారని విమర్శించారు. ఎన్నో ఏళ్లు సీఎంగా వ్యవహరించానని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పుకుంటారని, జగన్ దెబ్బకు గ్యాలరీ ఎక్కారని విమర్శించారు. ఈ సారి అసెంబ్లీ గ్యాలరీకి చంద్రబాబు వెళ్లేలా చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ రెండు బిల్లులను రాజకీయ కోణంలోనే చంద్రబాబు ఆలోచిస్తున్నారని విమర్శించారు. మండలి చైర్మన్‌కు సైగ చేసి ఆదేశాలు ఇచ్చారని ఆరోపించారు.
గ్యాలరీలోంచి చూస్తున్న టీడీపీ వారిలో ఎవరైనా తాగి వచ్చారేమో మరి వాసన వచ్చిందంటూ ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. మండలి చైర్మన్ నిబద్ధత కలిగిన పార్టీ కార్యకర్త అని, కానీ ఆయన తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు.

'చిత్రం... రాష్ట్ర మంత్రి కొడాలి నాని