ఆంధ్రప్రదేశ్‌

అభివృద్ధినీ వికేంద్రీకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జనవరి 23: జమ్మూకాశ్మీర్‌లో పాలనను ఏవిధంగా వికేంద్రీకరించారో అదే విధంగా రాష్ట్రంలో కూడా అభివృద్ధిని వికేంద్రీకరించాలని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. పాలన, అభివృద్ధిని వికేంద్రీకరించాలే గానీ రాజధానిని కాదన్నారు. గురువారం కర్నూలు నగరంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ అభివృద్ధి వికేంద్రీకరణ కోసం బీజేపీతో పాటు మిలిగిన పార్టీల వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తానన్నారు. అమరావతి తరలింపు బిల్లు ప్రస్తుతం సెలక్షన్ కమిటీకి వెళ్లిందని, మళ్లీ కోర్టుకు పోతుందన్నారు. మళ్లీ మళ్లీ ఏమైనా జరగొచ్చునన్నారు. సమయాన్ని వృధా చేయడం మంచిది కాదని, దీని వల్ల ప్రాజెక్టులు నిలిచిపోయి కేంద్రం నిధులు వెనక్కు వెళ్తాయన్నారు. వైజాగ్, కర్నూలులో మినీ సెక్రటేరియట్, శాసనసభ సమావేశం భవనాలు, హైకోర్టు బెంచ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం ఇస్తే బిల్డర్లు అంతర్జాతీయ స్థాయిలో భవనాలు నిర్మించి ఇస్తారన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ప్రజలకు నచ్చే విధంగా పాలన కొనసాగించి ముందుకు సాగాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయం, వార్డు సచివాలయ వ్యవస్థ దేశంలోనే భిన్నమైందన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థతో పరిపాలన ఏ విధంగా అయితే వికేంద్రీకరించారో అదే విధంగా రాష్ట్ర పరిపాలనా వ్యవస్థను కూడ వికేంద్రీకరించాలన్నారు. ముఖ్యమంత్రికి పట్టువిడుపులు ఉండాలని, ఒంటెద్దు పోకడలకు పోరాదన్నారు. ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా అది పాలన మీద ఎంతో ప్రభావం చూపుతుందన్నారు. వైజాగ్, రాయలసీమ ప్రాంతాల్లో మినీ సెక్రటేరియట్, హైకోర్టు బెంచ్, వేసవి శీతాకాలం సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్ సమైక్యాంధ్ర రాజధానిగా ఉన్నప్పుడే ఉత్తరాంధ్రలో వేసవికాల రాజధాని, రాయలసీమలో శీతాకాలం రాజధాని ఏర్పాటుచేయాలని తాము డిమాండ్ చేశామన్నారు. అమరావతి రాజధాని అయిన తర్వాత కూడా ఇదే రీతిలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామని ఆయన గుర్తు చేశారు. వైజాగ్‌లో మినీ సెక్రటేరియట్, హైకోర్టు బెంచ్, వేసవి కాల శాసనసభ సమావేశాలు, అలాగే కర్నూలులో హైకోర్టు బెంచ్, శీతాకాల సమావేశాలు, మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేస్తే అమరావతి సమస్యల లేకుండా ముందకు పోవడానికి మార్గం సుమగం అవుతుందన్నారు. ప్రభుత్వం ఎప్పడైనా అన్ని ప్రాంతాల సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు పోవాలని, కేంద్ర ప్రభుత్వం నిధులు సకాలంలో వాడుకుని రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలన్నారు. దేశానికి అమరావతిని రెండవ రాజధానిగా చేయాలని టీజీ వెంకటేష్ కోరారు.
'చిత్రం... టీజీ వెంకటేష్