ఆంధ్రప్రదేశ్‌

చట్టప్రకారమే వ్యవహరించా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తణుకు, జనవరి 23: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటుకు అనుకూలంగా ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుతోపాటు సీఆర్డీఏ రద్దు బిల్లులను చట్టప్రకారమే తిరస్కరించి, సెలక్ట్ కమిటీకి పంపించినట్టు శాసన మండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శాసన మండలిలో తాను వ్యవహరించిన తీరును సమర్థించుకున్నారు. దీనిపై అధికార పార్టీ వర్గీయులు చేస్తున్న విమర్శలను పట్టించుకోవటం లేదన్నారు. శాసన మండలిలో తాను పార్టీలకతీతంగా వ్యవహరిస్తున్నట్టు షరీఫ్ చెప్పారు. రాజధాని విషయమై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానాన్ని దాటవేశారు. కాగా శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ వ్యవహరించిన తీరుపై తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు వేల్పూరులోని ఆయన స్వగృహం వద్ద గురువారం షరీఫ్ చిత్రపటానికి పాలాభిషేకంచేశారు.

'చిత్రం...శాసన మండలి చైర్మన్ షరీఫ్