ఆంధ్రప్రదేశ్‌

ద్వివేదికి రాష్ట్రపతి పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్ర మాజీ ఎన్నికల ప్రధాన అధికారి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదికి జాతీయ పురస్కారం లభించింది. గత ఏడాది రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినందుకు గాను ఉత్తమ ఎన్నికల నిర్వహణ కేటగిరిలో ఆయన ఎంపికయ్యారు. శనివారం ఢిల్లీలోని జొరావర్ ఆడిటోరియంలో జరిగిన ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలోరాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఉత్తమ ఎన్నికల సీఈఒ అవార్డును ద్వివేది అందుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ సందర్భంగా రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల యంత్రాంగాన్ని నడిపించిన ఆయనకు అరుదైన పురస్కారం లభించటం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రజాస్వామికంగా ఎన్నికల కమిషన్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయటం ద్వారా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించ గలిగారని ప్రశంసించారు. ఎన్నికల ప్రధాన అధికారిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు, అనుసరించిన విధానాలు సత్ఫలితాలనిచ్చాయన్నారు. భవిష్యత్‌లో ఆయన మరిన్ని పురస్కారాలు సాధించాలని ఆకాంక్షించారు.

'చిత్రం... రాష్ట్ర మాజీ ఎన్నికల ప్రధాన అధికారి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది