ఆంధ్రప్రదేశ్‌

విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: విద్యుత్ శాఖలో వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని విద్యుత్ పంపిణీ సంస్థలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) చైర్మన్ జస్టిస్ వీ నాగార్జునరెడ్డి ఆదేశించారు. ఇందులో భాగంగా ఫిర్యాదుల బాక్స్‌లను వెంటనే ఏర్పాటు చేయాలని శనివారం అధికారులను ఆదేశించారు. విద్యుత్ సంస్థల్లో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. వినియోగదారుల ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి నిర్మాణాత్మక చర్యలు తీసుకోవటం ద్వారా వారిలో నమ్మకం కలిగించాలనేదే ప్రధాన ఉద్దేశమన్నారు. క్షేత్రస్థాయి నుండి సీఎండీ కార్యాలయం వరకు ఫిర్యాదు బాక్స్‌లను అందుబాటులోకి తేవాలన్నారు. ఇంగ్లీష్, తెలుగు భాషల్లో పబ్లిక్ నోటీసులను పొందుపరచాలని సూచించారు. వినియోగ దారులకు పంపిణీచేసే నెలసరి విద్యుత్ బిల్లుల వెనుక ఫిర్యాదు బాక్స్‌ల గురించి అవగాహన కల్పించేలా ముద్రించాలని ఆదేశించారు. ఫిర్యాదు బాక్స్‌లను ప్రతి నెలా 1వ తేదీ కల్లా క్లియరెన్స్ చేయాలన్నారు. ఉన్నతాధికారుల సమక్షంలో ఈ ప్రక్రియ నిర్వహించాలని స్పష్టం చేశారు. బాక్స్‌ల ద్వారా అందిన ఫిర్యాదులను పబ్లిక్ నోటీస్ బోర్డులో ఉంచటంతో పాటు పరిష్కారం చేయాల్సిన సంబంధిత అధికారికి ఈ ఆఫీస్ ద్వారా పంపాలన్నారు. ఫిర్యాదులు తీసుకున్న అనంతరం బాక్స్‌లను యథాతధంగా
తాళాలు వేసి ఉంచాలని సూచించారు. వినియోగదారులు ఫిర్యాదుల బాక్స్‌తో సంబంధం లేకుండా నేరుగా అధికారులను సంప్రతిస్తే సదరు ఫిర్యాదులను 48 గంటల్లోగా పరిష్కరించాలని కోరారు. అందిన ఫిర్యాదులు, పరిష్కరించిన తీరు తదితర వివరాలను డిస్కంల వెబ్‌సైట్‌లో పొందుపరచాలని సూచించారు. ఫిర్యాదుల వివరాల పరిస్థితిని వివరిస్తూ వెబ్‌సైట్‌తో పాటు ఎస్‌ఎంఎస్ మెసేజ్, ఈ మెయిల్ ద్వారా వినియోగదారులు తెలుసుకునే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు. ప్రతి ఫిర్యాదును అప్‌లోడ్ చేయటంతో పాటు పరిష్కారం వివరాలను కూడా నిక్షిప్తం చేయాలని, వీటన్నింటినీ నెలవారీ నివేదిక రూపంలో సంబంధిత అధికారుల వద్దకు చేర్చాలని, ప్రతి మూడు నెలలకు ఈ నివేదికలను ఏపీ ఈఆర్‌సీకి పంపాలని జస్టిస్ నాగార్జున రెడ్డి అధికారులను ఆదేశించారు.

'చిత్రం... ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) చైర్మన్ జస్టిస్ వీ నాగార్జునరెడ్డి