ఆంధ్రప్రదేశ్‌

ఫిరాయింపులకు బ్రేక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: రాష్ట్ర రాజకీయాల్లో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. గత ఎన్నికల్లో భారీ ఆధిక్యత అందుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపధ్యంలో ఆ పార్టీలో చేరాలనుకున్న టీడీపీ నేతలు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇదే సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన మార్పులతో ప్రస్తుతానికి పార్టీ ఫిరాయింపులపై పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. టీడీపీని పూర్తిగా సమాధి చేయాలంటే ఆ పార్టీలోని కీలక నేతలను ఆహ్వానించాలని వైసీపీ భావించింది. ఆ క్రమంలో పలువురు నాయకులను పార్టీలో చేర్చుకోవడానికి ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాట్లు జరిగాయి. ఈ విషయాలు ప్రసార మాధ్యమాలతో పాటు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టినా నాయకులు పెదవి విప్పలేదు. దీంతో ఫిరాయింపులు దాదాపు ఖరారని భావించారు. ఈ క్రమంలో మూడు రాజధానుల ప్రకటన, అమరావతి రైతుల ఆందోళనలు, మండలిలో వికేంద్రీకరణ బిల్లు, సిఆర్‌డిఎ రద్దు బిల్లులు సెలక్షన్ కమిటీకి పంపడం, హైకోర్టులో పిటీషన్ల విచారణ, రాజధాని తరలింపును నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించడంతో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపులకు సిద్ధంగా ఉన్న నాయకులు తమ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు సమాచారం. వాస్తవానికి టీడీపీ నుంచి భారీ సంఖ్యలో ఫిరాయింపులు ఉంటాయని భావించినా అది ఇప్పుడే కాదని తేలింది. రాజధాని తరలింపు వ్యవహారం తేలేంతవరకు కొద్దిరోజులు వేచి చూసే ధోరణిలో టీడీపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.