ఆంధ్రప్రదేశ్‌

విశాఖ కేంద్రంగా పర్యాటక భవన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 25: విశాఖపట్నం కేంద్రంగా పర్యాటక భవన్ ఏర్పాటు కానుంది. దీనికి రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక చొరవ చూపుతోంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ కానున్నాయి. ఇప్పటికే ‘టూరిజం హబ్’గా ప్రసిద్ధి చెందుతున్న విశాఖ ఇక నుంచి దేశ, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షించే విధంగా వౌలిక వసతులతో కూడిన ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని ఈ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా పర్యాటక భవన్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. పర్యాటక భవన్‌లోనే ఆయా దేశాల సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టేపడేలా, పర్యాటకాన్ని అనుసంధానిచ్చే విధంగా ఈ భవన్‌లోనే ‘ప్రత్యేక పర్యాటక కౌంటర్’లుంటా యి. వీటి ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ప్రసిద్ధిగాంచిన పర్యాటక ప్రదేశాలు, భౌద్ధారామాల గురించిన విశిష్టతను ఆయా దేశాలకు పర్యాటక సమాచారాన్ని అందజేస్తారు. దీనివలన పరస్పర పర్యాటక సంబంధాలు మెరుగుపడతాయని ఈ శాఖ భావిస్తోంది. మరోపక్క ఏపీలో ఉండే పర్యాటక ప్రదేశాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతాయి. కేరళ, కర్ణాటక,
మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, గుజరాత్ తదితర రాష్ట్రాల నుంచి గత రెండేళ్ళుగా విశాఖకు వస్తున్న పర్యాటక సంఖ్య రెండు నుంచి మూడు లక్షలకు పెరిగింది. ఇక ప్రపంచదేశాల్లో కెనడా, న్యూజిలాండ్, చైనా, జర్మనీ, లండన్ వంటి దేశాలకు చెందిన పర్యాటకులు విశాఖను ఆకర్షించే విధంగా పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఏపీ పర్యాటకశాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. ఇటువంటి వాటికి ఈ పర్యాటక భవన్ తోడ్పడనుందని అధికారులు చెబుతున్నారు. ఆయా దేశాల పర్యాటక అభివృద్ధి తరహాలో ఏపీలో ఉండే ప్రముఖ పర్యాటక ప్రదేశాలను తీర్చిదిద్దాలని పర్యాటకశాఖ ఆలోచన చేస్తోంది. ఇప్పటికే ఆంధ్రా ఊటీగా పేరున్న అరకు ప్రదేశాన్ని సహజసిద్దమైన వనరులు, తూర్పుకనుమల అందాలు వీక్షిస్తూ అనుభూతి పొందుతున్న దేశ, విదేశీ పర్యాటకుల కోసం మరిన్ని మెరుగైన వసతులు కల్పించేందుకు సన్నాహాలు చేపట్టింది. విస్టాడోమ్ వంటి ఏసీ అద్దాల రైలును మరో దానిని నిర్వహించే ప్రయత్నాలు సాగుతుండగా, రిస్టార్ట్స్ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఏపీ రాజధాని అమరావతితోపాటు విశాఖ, గుంటూరు, కర్నూలు, విజయనగరం తదితర ప్రాంతాల్లో ఉండే పర్యాటక ప్రదేశాలు, బౌద్ధారామాలు, రిస్టార్ట్స్, టెంపుల్ టూరిజం, హెలీ టూరిజం, బోటు షికారు వంటి వాటిని మరింతగా అభివృద్ధి చేయాలని ఈ శాఖ నిర్ణయించింది. ఇందులోభాగంగా విశాఖ రుషికొండ బీచ్‌లో ఇటీవల రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు బోటు షికారును పునఃప్రారంభించారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన 175 బోట్లు ఉండగా ప్రస్తుతం 110 వరకు అందుబాటులోకి రాగా, నాలుగు బోట్లతో విశాఖ సాగరంలో బోట్లు షికారు జరుగుతోంది. ఇదే తరహాలో నదులు, ఏపీలో పలు ప్రాంతాల సముద్రంలో బోటు షికార్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏపీ పర్యాటకశాఖ ప్రత్యేక దృష్టిసారిస్తోంది. ఇదే తరహాలో హెలీ టూరిజం, టెంపుల్ టూరిజం వంటి వాటిని అందుబాటులోకి తీసుకువస్తే దేశ, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షివచ్చని, ఇందుకోసం ప్రత్యేక ప్యాకేజీలను అమలు చేయాలని ఆలోచన చేస్తోంది.