ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 25: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వ్యాపారులు, మిల్లర్ల నుండి కాకుండా నేరుగా రైతుల నుంచి మద్దతు ధరకు ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పీ మధు డిమాండ్ చేశారు. ఈ క్రాప్‌తో సంబంధం లేకుండా కౌలు రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని, రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వ యంత్రాంగాన్ని కదలించాలని కోరుతూ శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మధు లేఖ రాశారు. ప్రభుత్వం 1670 కొనుగోలు కేంద్రాల ద్వారా 60 లక్షల టన్నులు కొనుగోలు చేస్తామని ప్రకటించినా వాస్తవానికి కొనుగోలు కేంద్రాల్లో నేరుగా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. ఫలితంగా రైతులు క్వింటాల్ రూ. 1600 నుండి రూ. 1300లకే ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తోందని, దీని వలన రైతులు క్వింటాల్‌కు రూ. 515ల నుండి రూ. 205 వరకు నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్ల నుండి కొనుగోలు చేసి బీనామీ రైతుల పేర్లు నమోదు చేసి రైతుల వద్ద నుండే కొనుగోలు చేసినట్లు చూపిస్తున్నారన్నారు. ఈ క్రాప్ పేరుతో కౌలు రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడం లేదని, రైతులు నేరుగా తీసుకువెళితే 4,5 రోజుల కాలయాపన చేస్తున్నారన్నారు. మిల్లర్లు, బ్రోకర్లు తక్కువ ధరకు రైతుల వద్ద నుండి కొన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో బీనామీ రైతుల పేరుతో అమ్మి కనీస మద్దతు ధర పొందుతున్నారన్నారు.