ఆంధ్రప్రదేశ్‌

నిర్లక్ష్యపు నీడలో శ్రీ కృష్ణదేవరాయని శాసనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 25: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మీదున్న నరసింహస్వామి దేవాలయ గోపురం వెలుపల నిర్లక్ష్యంగా పడి ఉన్న శ్రీ కృష్ణదేవరాయల శాసనం పట్ల విజయవాడ కల్చరల్ సెంటర్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్ర పరిశోధకుడు కొండ శ్రీనివాసులు ఇచ్చిన సమాచారం మేరకు కల్చరల్ సెంటర్ చేపట్టిన ‘ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టెరిటీ’ పథకంలో భాగంగా శనివారం శివనాగిరెడ్డి, కృష్ణాజిల్లా రచయితల సంఘం కార్యదర్శి జీవీ పూర్ణచంద్, సాహితీవేత్త గుమ్మా సాంబశివరావు, కొండా శ్రీనివాసులతో కలిసి ఆ శాసనాన్ని పరిశీలించారు. క్రీ.శ 1527, ఆగస్టు 11వ తేదీ నాటి ఈ రాతి శాసనంలో అప్పుడు సోమరాజుపల్లిగా పేర్కొన్న సింగరాయకొండ పర్ణశాల నరసింహస్వామి అంగరంగ వైభవాల కోసం ఉదయగిరి దుర్గ్ధాపతి రాయనం అప్పయ్యరుసు, కందుకూరి సీమలోని జిల్లెళ్లమూడి గ్రామాన్ని సర్వమాన్యంగా ఇచ్చినట్లు తెలిపే చారిత్రకాంశాలున్నాయన్నారు. చారిత్రక ప్రాధాన్యతగల 493 ఏళ్లనాటి ఈ శాసనాన్ని ఆలయం లోపలకి తరలించి, భద్రపరచి, శాసన విషయాన్ని తెలియచెప్పే ఫలకాన్ని నిలబెట్టాలని, ఆలయ పూజారులు, గ్రామస్థులు, దేవాదాయ, పురావస్తుశాఖ అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు.