ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రాల అసెంబ్లీల్లో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానాలు: అజీజ్ పాషా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 25: పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ)కి వ్యతిరేకంగా అసెంబ్లీల్లో తీర్మానాలు చేసే రాష్ట్రాల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఆలిండియా తన్‌జీన్ - ఈ - ఇన్సాఫ్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు అజీజ్ పాషా తెలిపారు. సీఏఏను అమలు చేసేదిలేదంటూ తొలుత కేరళ అసెంబ్లీ తీర్మానం చేయగా, తర్వాత పంజాబ్ అసెంబ్లీ కూడా తీర్మానం చేసిందన్నారు. తాజాగా రాజస్థాన్ అసెంబ్లీ తీర్మానం చేసిందని, త్వరలోనే పశ్చిమ బెంగాల్‌లోనూ తీర్మానం చేయనున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇన్సాఫ్ రాష్ట్ర కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు అజీజ్ పాషా శనివారం విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఏఏకు ఈశాన్య రాష్ట్రాల్లోనూ వ్యతిరేకత పెరుగుతున్నట్లు తెలిపారు. సీఏఏ వల్ల ముస్లింలకే కాకుండా అందరికీ నష్టమేనన్నారు. ఎంతో ముఖ్యమైన సీఏఏతోపాటు జాతీయ పౌర నమోదు (ఎన్‌ఆర్‌సీ), జాతీయ పౌర పట్టిక (ఎన్‌పీఆర్)పై మూడు రోజుల్లోనే చర్చ ముగించడం గమనార్హమన్నారు. చర్చలో సూచనలు, సలహాలు, విమర్శలకు తావివ్వకుండా ఏకపక్షంగా మూడు రోజుల్లోనే ఉభయ సభల్లోనూ ఆమోదింప చేసుకున్నారని తెలిపారు. విద్యార్థుల ఆందోళనల్లో ముస్లింలు ఐదు నుంచి పది శాతం మందే ఉంటే మిగిలిన వారంతా ఇతర వర్గాలకు చెందిన వారు పాల్గొంటున్నారన్నారు. నిరసనలపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.