ఆంధ్రప్రదేశ్‌

బీజేపీ కార్యకర్తలపై దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 25: రాష్ట్రంలో అనవసరమైన ఆందోళనలతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కోరారు. సీఏఏ, ఎన్‌ఆర్‌పీ బిల్లులపై కొంతమంది అనవసరమైన అపోహలను కల్పిస్తున్నారని, దీంతో హిందువులపైనా, తమ పార్టీ కార్యకర్తలపైనా దాడులకు దిగుతున్నారని తెలిపారు. ఈ మేరకు శనివారం మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో రాష్డ్ర డీజీపీ గౌతం సవాంగ్‌ను కన్నా కలసి వినతిపత్రం అందజేశారు. తెనాలిలో జనవరి 8వ తేదీన అవ్వారు శ్రీనివాసరావుపై జరిగిన దాడి బీజేపీ కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేస్తోందని కన్నా పేర్కొన్నారు.
అలాగే నందిగామలో బీజేపీ కార్యకర్తలు షేక్ సుభాని, షేక్ సైదా సామాజిక బహిష్కరణ, నెల్లూరులో బీజేపీ కార్యకర్తలపై దాడి, ఆదోని, కదిరి పట్టణాల్లో జాతీయ పతాకం పట్టుకోరాదని హెచ్చరించడం, కడప డిప్యూటీ మేయర్ ఆరీఫుల్లా సామాజిక బహిష్కరణ వంటివి ఎంతో ఆందోళనకు గురి చేస్తున్నాయని వివరించారు. ఆయా అంశాలపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని డీజీపీని ఇచ్చిన లేఖలో కోరారు. 2018 డిసెంబర్ 10న విజయవాడలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత శాంతియుతంగా ధర్నా చేసిన సందర్భంలోనూ రాజకీయ దురుద్దేశంతో పెట్టిన మూడు కేసులను వెనక్కి తీసుకోవాలని కోరారు. డీజీపీ సవాంగ్‌ను కలిసిన వారిలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడికొండల మాణిక్యాలరావు, అడప శివనాగేంద్రరావు, పాతూరి నాగభూషణం తదితరులున్నారు.
కన్నాను కలిసిన జేఏసీ నాయకులు
రాజధాని అమరావతి కోసం ఐక్యంగా కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ సభ్యులు శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిసి వివరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కన్నాను జేఏసీ కన్వీనర్ ఏ శివారెడ్డి, కో కన్వీనర్ గద్దె తిరుపతిరావు, కమిటీ సభ్యులు ఆర్‌వీ స్వామి, పరుచూరి కిరణ్‌కుమార్ కలిశారు. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ రాజధానిగా అమరావతి పరిరక్షణ కోసం ఇప్పటికే గత 30 రోజులుగా ఆందోళనలు చేస్తున్నామని తెలిపారు. రాజధాని అమరావతి కోసం భవిష్యత్తులో అందరం కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

'చిత్రం...డీజీపీ సవాంగ్‌కు వినతిపత్రం అందజేస్తున్న కన్నా లక్ష్మీనారాయణ