ఆంధ్రప్రదేశ్‌

ప్రలోభాలకు లొంగితే తెరమరుగే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 25: తెలుగుదేశం పార్టీ పోరాట పటిమను 1984లో పార్టీ ఎమ్మెల్యేలు చాటితే ప్రపంచం మొత్తం అభినందించిందని, తాజాగా టీడీపీ ఎమ్మెల్సీలు విలువలు, విశ్వసనీయ చాటుతూ ప్రదర్శించిన తీరుతో ఆదర్శమూర్తులుగా నిలబడ్డారని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయం నుండి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ చెడు ఆలోచనలు వారినే దగ్ధం చేస్తాయని అందుకే చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అని జాతిపిత గాంధీజీ సూచించారన్నారు. బెదిరింపులకు భయపడితే కనుమరుగు అవుతారని, ప్రలోభాలకు లొంగితే తెరమరుగు అవుతారన్నారు. పార్టీ కోసం చేసిన త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయని, పోరాడే వారికే తెలుగుదేశం పార్టీలో పెద్దపీట ఉంటుందన్నారు. అలాంటి వారే ప్రజల్లో గుండెల్లో సైతం చిరస్థాయిగా నిలిచి ఉంటారని తెలిపారు. 1984లో పోరాడిన 161 మంది ఎమ్మెల్యేలకు మళ్లీ టిక్కెట్లు ఇచ్చి గౌరవించామని, 1989-94లో వీరోచితంగా పోరాడిన 74 మంది శాసనసభ్యులకు మళ్లీ టిక్కెట్లు ఇచ్చామని, ఇప్పుడూ దీటుగా పోరాడే ఎమ్మెల్సీలకు అదే గౌరవం, గుర్తింపు ఇస్తామని పేర్కొన్నారు. ధనం శాశ్వతం కాదని, విలువలు, మంచిపేరు కలకాలం మనవెంటే ఉంటాయని, తప్పటడుగులు వేస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదని స్పష్టంచేశారు. 1984లో తప్పటడుగులు వేసిన వారు తెరమరుగు అయ్యారన్నారు. బాలయోగి, ఎర్రన్నాయుడు, లాల్‌జాన్‌బాషా, మాధవరెడ్డి టీడీపీ ధ్వజస్తంభాలుగా నిలబడ్డారని, అందుకే టీడీపీ చరిత్ర పుటల్లో చిరస్థాయిలో నిలిచారని గుర్తుచేశారు. ఇటీవల జరిగిన మండలి సమావేశాల్లో యనమల పోరాడితే, టీడీపీ ఎమ్మెల్సీలంతా కోటగోడలా నిలబడ్డారని, ఆ స్ఫూర్తి మనందరిలో రావాలన్నారు. వీరోచిత పోరాటాలతో ఎమ్మెల్సీలు టీడీపీని నిలబెట్టారని, వారిని ప్రలోభపెట్టడం ఎవరివల్లా కాదన్నారు. ప్రజలు ఒకసారి జగన్ చేతిలో మోసపోయారని, మళ్లీ మళ్లీ మోసపోయేందుకు సిద్ధంగా లేరన్నారు. టీడీపీ చేసిన అభివృద్ధి పనులను కనపడకుండా చేయాలని, టీడీపీ పేరును తుడిపేయాలన్న దురుద్దేశంతో వారు వ్యవహరిస్తున్నారన్నారన్నారు. తెలుగుదేశం పార్టీ విలువలు కల్గిన నేతలు, అంకితభావం గల నాయకులు, క్ష్రమశిక్షణ కల్గిన కార్యకర్తలతో పటిష్టంగా ఉండే పార్టీ అన్నారు. ఈ పార్టీని ప్రజల హృదయాల నుండి తుడిపేయడం ఎవరితరమూ కాదని చంద్రబాబు పేర్కొన్నారు.
'చిత్రం...మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు