ఆంధ్రప్రదేశ్‌

నాటి యోధుల త్యాగాలు నేటితరానికి స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 26: మన దేశ స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం ప్రాణాలర్పించిన నాటి యోధుల త్యాగాలను నేటితరానికి స్ఫూర్తిదాయకమని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. వారితో పాటు గత ఏడు దశాబ్దాలుగా దీన్ని కాపాడటానికి ప్రాణాలర్పించిన సాయుధ దళాలు, పారా మిలటరీ సిబ్బంది, భద్రతా దళాల పోరాట యోధులకు నివాళులు అర్పిస్తున్నానన్నారు. భారత 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం గవర్నర్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన సందేశమిస్తూ వివిధ విశ్వాసాలు, భాషలు, ప్రాంతాలు, జాతులకు చెందిన 130 కోట్ల మంది ప్రజలను ఏకం చేయడంలో మన ప్రజాస్వామ్య వ్యవస్థ విజయవంతమైందన్నారు. మన రాజ్యాంగం సమాజంలోని అన్నివర్గాల హక్కుల పరిరక్షకుడిగా పనిచేస్తోందన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం వంటి ఆదర్శాలతో సామాజిక, ఆర్థికాభివృద్ధి ఫలాలు ప్రతీ ఒక్కరికీ చేరతాయన్నారు. ఇటీవల మంత్రి మండలిలో ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, న్యాయపాలన కర్నూల్ నుండి, చట్టసభలను అమరావతిలో ఉంచాలని నిర్ణయించిందని చెప్పారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం రాష్ట్ర సమగ్రాభివృద్ధి మార్గంలో ముందుకు సాగి, అన్నివర్గాల సంతృప్త స్థాయిని పెంచుతుందని ఆయన ఆకాంక్షించారు. మహిళలు, బాలికల భద్రతను కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఏపీ ‘దిశ’ చట్టం చరిత్రాత్మకమైనదన్నారు. 7.2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీటి పారుదల సౌకర్యం కల్పిచడంతో పాటు మరో 23.5 లక్షల ఎకరాలను స్థిరీకరించేందుకు 2021 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమంలో భాగంగా ‘వైఎస్సార్ రైతు భరోసా’ను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. సాగుచేసే రైతులకు ప్రతీ ఏడాది రూ. 13,500 చొప్పున రాష్ట్రంలోని 46లక్షల మంది రైతులకు అందించాలనే సాహసోపేత నిర్ణయం తీసుకుందని చెప్పారు. జగనన్న అమ్మఒడి పథకంతో నూరుశాతం అక్షరాస్యత సాధించేలా ప్రయత్నం జరుగుతోందని, తెలుగును కొనసాగిస్తూ అన్ని తరగతుల
విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చదువుకునేలా పథకానికి రూపకల్పన జరిగిందన్నారు. రూ. 2300 కోట్లతో జగనన్న వసతి దీవెన, వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్‌ఆర్ కంటివెలుగు, వైఎస్‌ఆర్ పింఛన్ కానుక పథకాల రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. వైఎస్‌ఆర్ నేతన్న నేస్తం, వైఎస్‌ఆర్ మత్స్యకార భరోసా పథకాలు అమలు చేస్తున్నామని, వైఎస్‌ఆర్ వాహనమిత్ర పథకం కింద రాష్ట్రంలోని 2.36 లక్షల మంది డ్రైవర్ కం ఓనర్లకు రూ. 236 కోట్లు అందించినట్లు తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోడానికి బడ్జెట్‌లో రూ. 1150 కోట్లు కేటాయించగా, రూ. 10వేల లోపు డిపాజిట్‌దార్లు 3,69,655 మంది బాధితులకు రూ. 264 కోట్లు అందించామన్నారు. భావనపాడు, మచిలీపట్నం, రామయ్యపట్నం సహా కొత్త ఓడరేవులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని గవర్నర్ హరిచందన్ వివరించారు. తొలుత గవర్నర్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, తదితరులు సాదర స్వాగతం పలికారు. కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరి, రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎంపీలు కే బాలశౌరి, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యేలు కే పార్థసారథి, మల్లాది విష్ణు, కొక్కిలిగడ్డ రక్షణనిధి, ఎం జగన్‌మోహనరావు, తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, విజయవాడ సీపీ ద్వారకాతిరుమలరావు, తదితరులు పాల్గొన్నారు.
'చిత్రం... విజయవాడలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేస్తున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్