ఆంధ్రప్రదేశ్‌

తొలి అడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: వివిధ పార్టీల సభ్యుల పేర్లను ఆహ్వానిస్తూ ప్రభుత్వ విప్‌లకు రాష్ట్ర శాసన మండలి చైర్మన్ షరీఫ్ లేఖలు రాయడంతో సెలక్ట్ కమిటీల ఏర్పాటులో తొలి అడుగు పడింది. వికేంద్రీకరణ, ఏపీ సీఆర్డీఏ రద్దు బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొంది, మండలిలో చర్చకు వచ్చాయి. అయితే రూల్ 71 కింద ముందుగా చర్చ జరపాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టడం తెలిసిందే. ఈ నోటీసుపై చర్చ జరిగే ముందు రెండు బిల్లులను మండలి పరిగణనలోకి తీసుకుంది. అయితే సెలక్ట్ కమిటీకి పంపాలంటూ సవరణలో ఇచ్చిన లేఖపై బిల్లులను పరిగణనలోకి తీసుకునే ముందు సభలో ప్రవేశపెట్టాలని అధికార పక్షం స్పష్టం చేసింది. ఈ సాంకేతిక కారణాన్ని చూపి బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపే వీలులేదని తెలిపింది. అయినప్పటికీ తనకున్న విచక్షణాధికారంతో ఈ రెండు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపుతున్నట్లు మండలి చైర్మన్ షరీఫ్ ప్రటించారు. ఆ తరువాత రెండు బిల్లులపై వేర్వేరుగా కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కమిటీలో 9మంది సభ్యులు ఉంటారు. టీడీపీ నుంచి ఐదుగురు, వైకాపా, పీడీఎఫ్, బీజేపీ నుంచి ఒక్కొరికి
స్థానం కల్పించనున్నారు. ఆయా కమిటీలకు చైర్మన్‌లుగా ఆయా శాఖల మంత్రులే వ్యవహరిస్తారు. ఈమేరకు పేర్లు ఇవ్వాలని కోరుతూ మండలిలోని వివిధ పార్టీలకు లేఖలు రాశారు. కమిటీని ఏర్పాటు చేశాక బిల్లులపై కసరత్తు ప్రారంభిస్తాయి. సాధారణంగా సెలక్ట్ కమిటీ తన నిర్ణయం చెప్పేందుకు మూడు నెలల నుంచి సంవత్సరం వరకూ సమయం తీసుకుంటుంది. అవసరమైన సందర్భాల్లో కాలపరిమితిని పొడిగించుకునే వీలు కూడా ఉంది.