ఆంధ్రప్రదేశ్‌

వైభవంగా వాసవీమాత ఆత్మార్పణ దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆచంట, జనవరి 26: పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో వేంచేసియున్న వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. స్థానిక బజార్ రామాలయం నుండి ఆర్యవైశ్య మహిళలు 102 కలశాలతో, వాసవీ దీక్షాదారులతో, మేళతాళాలతో ఊరేగింపుగా దేవాలయానికి విచ్చేసి, వాసవీ మాతకు పంచామృత అభిషేకం, దీపారాధన, కుంకుమ పూజలు చేసి, చందన అలంకారం చేశారు. దేవస్థానం ఈవో గోకవరపు శ్రీనివాస్ తెలిపారు. దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన 102 యజ్ఞగుండాలతో హోమాలు చేశారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుండి వచ్చిన వాసవీ మాలధారులు ఇరుముడులు సమర్పించారు. స్థానిక ఆర్యవైశ్య యువజన సంఘం సహకారంతో 102 హోమాలు, సుమంగళి పూజలు చేశారు. కోయంబత్తూరు యాత్రమిత్ర బృందం సహకారంతో శ్రీ వాసవీమాత అగ్నిప్రవేశం నిర్వహించారు. భక్తులు నియమ నిబంధనలతో స్నానమాచరించి నిప్పుల గుండం తొక్కారు. వాసవీ అమ్మవారిని తెల్లవారుజాము నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేలాది మందికి అన్నసమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు పీఠాధిపతులు, ఈవో గోకవరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.