ఆంధ్రప్రదేశ్‌

మండలికి మంగళం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్ర శాసనమండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపుతూ మండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయం పర్యవసానంగా శాసనమండలినే రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ సమావేశంలో మండలి రద్దుపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బిల్లులకు అవరోధంగా మండలి మారుతోందని, రాజకీయ ప్రయోజనాలకు వేదిక అవుతోందని మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా దీనిపై రూ. 60 కోట్ల భారం పడుతోందని, ప్రజలు నేరుగా ఎన్నుకున్న శాసనసభలో ప్రజా ప్రయోజనాల కోసం ప్రవేశపెడుతున్న బిల్లులు కూడా మండలిలో తిరస్కరణకు గురవుతున్న నేపథ్యంలో దానిని రద్దుచేయాలనే అంశానికే మంత్రులు మొగ్గు చూపారు. ఈ మేరకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అనంతరం శాసనమండలి రద్దు తీర్మానాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. (ది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిసాల్వ్స్ దట్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ది స్టేట్ బీ అబాలిష్డ్’) తీర్మానంపై మంత్రులు, సభ్యులు సాయంత్రం వరకు చర్చించారు. కాగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ శాసనసభ సమావేశాలను బహిష్కరించింది. ఒక సభకు సంబంధించిన అంశాన్ని మరో సభలో ఎలా చర్చిస్తారని ఆ పార్టీ నేతలు అభ్యంతరం తెలిపారు. మండలి రద్దు విషయాన్ని ముందుగానే తెలుసుకున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాన్ని బహిష్కరించారు. ఇదిలా ఉండగా టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తీర్మానాన్ని సమర్ధిస్తూ మాట్లాడారు. ఆయనతో పాటు జనసేన ఎమ్మెల్యే రాపాకవరప్రసాద్ కూడా మద్దతు ప్రకటించారు. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం దీనిపై ఓటింగ్ నిర్వహించేందుకు రూలింగ్ ఇచ్చారు. తీర్మానానికి అనుకూలంగా వ్యవహరించే వారు లేచి నిలబడాల్సిందిగా స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. శాసనసభ కార్యదర్శి
లెక్కింపు జరిపి 122 మంది సభ్యులు మద్దతిచ్చినట్లు లెక్క తేల్చారు. అయితే స్పీకర్ మరోసారి లెక్కించాలని ఆదేశించడంతో 133 మంది సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటేసినట్లు గుర్తించారు. సభలో మొత్తం 175 మంది సభ్యులకు గాను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 151 మంది, 23 మంది టీడీపీ, జనసేన తరుపున ఒక ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీకి ఇద్దరు రాజీనామా చేయటంతో వారిని తటస్థులుగా పరిగణిస్తున్నారు. కాగా వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన 151 మందిలో 19 మంది సభ్యులు హాజరు కాలేదు. ఈ తీర్మానం మూడింట రెండువంతుల మెజారిటీతో నెగ్గాల్సి ఉంది. జనసేన ఎమ్మెల్యేతో కలుపుకుని 133 మంది సభ్యులు ఆమోదం తెలిపారు. ఇక ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిన అనంతరం కేంద్ర కేబినెట్‌లో చర్చించి పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెడతారు. పార్లమెంట్ ఆమోదించిన తరువాత రాష్టప్రతి సంతకం చేసి గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచి మండలి రద్దవుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1953లో ఏర్పడిన మండలి 1983లో రద్దయింది. అనంతరం 2007లో పునరుద్ధరించారు. రాష్ట్ర విభజన అనంతరం ఇప్పుడు రద్దు ప్రక్రియ ప్రారంభమయింది.