ఆంధ్రప్రదేశ్‌

ఎమ్మెల్సీల రాజకీయ భవితవ్యంపై సర్వత్రా చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 27: శాసన మండలి రద్దు తీర్మానం అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం తదుపరి ప్రస్తుతం ఉన్న 55 మంది శాసనమండలి సభ్యుల భవితవ్యంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇక శాసనమండలికి చెందిన రాష్ట్ర మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ నైతికతతో ఏ క్షణాన్నైనా తమ పదవులకు రాజీనామా చేస్తారన్న ప్రచారం సాగుతోంది. ఇక శాసన మండలిలో అత్యధికంగా 27 మంది సభ్యులు టీడీపీకి చెందిన వారు, తొమ్మిది మంది వైకాపాకు చెందిన వారు, బీజేపీకి ఇద్దరు, కాంగ్రెస్ తరపున ఒకే ఒకరు ఉన్నారు. సీపీఐ, సీపీఎంలకు అటు శాసనసభలో ఇటు శాసనమండలిలో ఎటూ స్థానం లేదు. అయితే శాసనమండలి ఉపాధ్యాయ, పట్ట్భద్రుల నియోజకవర్గం నుండి ఎన్నికైన వారిలో కొందరు సీపీఎం మరికొందరు సీపీఐ పక్షంగా పార్టీల వాణి వినిపిస్తూ వస్తున్నారు. శాసన మండలి రద్దుతో చట్టసభల్లో బీజేపీ, కాంగ్రెస్‌కి కూడా స్థానం లేకుండా పోబోతున్నది. ఇక శాసన సభ ఆమోదించిన తీర్మానాన్ని ఆగమేఘాలపై కేంద్రానికి పంపించే వ్యవహారంలో రాష్ట్ర పాలకులు నిమగ్నమై ఉన్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ఆమోదింప చేయించి రాష్ట్రపతి ముద్ర వేయించి చట్టాన్ని తీసుకురావాలని, వచ్చే శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ వ్యవహారాన్ని ముగించాలని పాలకులు భావిస్తుంటే చట్టం కావటానికి కనీసం మరో నాలుగైదు నెలల వ్యవధి పడుతుందని విపక్షాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే రద్దు తీర్మాన ప్రక్రియ ఎలా ఉన్నప్పటికీ శాసన మండలిలో తాను ప్రకటించిన విధంగా సెలక్ట్ కమిటీ ఏర్పాటులో మండలి చైర్మన్ షరీఫ్ నిమగ్నమై ఉన్నారు. సభ్యుల పేర్ల
కోసం టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ, పీడీఎఫ్‌లకు ఇప్పటికే మండలి చైర్మన్ నుంచి లేఖలు వెళ్లాయి. అతి త్వరలోనే కమిటీతోపాటు ఆ కమిటీ విధివిధానాలను ప్రకటించబోతున్నారు. ప్రభుత్వ నిధులతో కమిటీ సభ్యులందరినీ 13 జిల్లాల్లో పర్యటింప చేసి అధికారపక్షానికి వ్యతిరేకంగా ప్రచారం జరిపించాలన్న భావనలో టీడీపీ నేతలు ఉన్నారు. ఇక యువ నేత లోకేష్‌కు శాసన మండలి రాజకీయ బిక్ష పెట్టిందనే చెప్పాలి. శాసనమండలి సభ్యునిగా కొంతకాలంగా కీలకమైన పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఏదిఏమైనా అత్యధిక మంది సభ్యుల్లో పదవులు కోల్పోతున్నామని ఆవేదన కన్పిస్తున్నది.
*చిత్రాలు.. మోపిదేవి వెంకటరమణ *పిల్లి సుభాష్ చంద్రబోస్