ఆంధ్రప్రదేశ్‌

ఎవరడ్డొచ్చినా ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ప్రతిపాదనకు సంబంధించిన అంశంపై ప్రపంచంలో ఎవరడ్డొచ్చినా ఆగే ప్రసక్తే లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ప్రగతి భారతి ఫౌండేషన్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో విశాఖలోని మంగళవారం పెద్దరుషికొండ ప్రాంతాంలో మొక్క నాటారు. ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చుదిద్దుతామని, కొద్ది రోజులు ఆలస్యమైనా అమలు చేస్తామన్నారు. మూడు రాజధానుల విషయంపై కొంత మంది వ్యక్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, అన్ని అడ్డంకులను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి త్వరలోనే అధిగమిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాజధానుల మార్పు విషయంపై బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉందని తనకు తెలియదని, ఎంపీ సుజనా చౌదరి మాత్రమే వ్యతిరేకంగా ఉన్నారని
ఆరోపించారు. శాసన మండలి రద్దు వ్యవహారంలో మూడు రాష్ట్రాలకు సంబంధించిన ప్రతిపాదనలు సైతం ప్రస్తుతం కేంద్రం వద్ద ఉన్నాయని, ఆ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా చూసుకుంటున్నారన్నారు. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తుందని, తొలి దశలో విశాఖలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించామని, రాష్టవ్య్రాప్తంగా 25 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నామన్నారు. విశాఖను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మూడు మొక్కలు చొప్పున నాటాలనే గ్రీన్ ఛాలెంజ్‌లో కలెక్టర్, గ్రేటర్ విశాఖ కమిషనర్, సినీ నటుడు నాగుర్జున, క్రికెటర్ కపిల్‌దేవ్ పాల్గొనాలని కోరారు. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్, గ్రేటర్ కమిషనర్ సృజన, ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.

*చిత్రం...విశాఖ పెద్దరుషికొండలో మొక్క నాటుతున్న ఎంపీ విజయసాయి రెడ్డి