ఆంధ్రప్రదేశ్‌

అంబేద్కర్ జయంతికి ‘స్వగృహ సంకల్పం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: రాజ్యాంగ నిర్మాత బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా పేదల కోసం ఇప్పటికే పూర్తయిన నూతన గృహాలను ప్రారంభించడం, కొత్త గృహాలకు శంకుస్థాపన చేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు తెలిపారు. ఒకే రోజు 5.80 లక్షల గృహాలను ఆ కార్యక్రమంలో చేర్చారు. తద్వారా యావత్ దృష్టిని ఆకర్షించాలని సిఎం చూస్తున్నారు. శనివారం ఆయన హైదరాబాద్ సచివాలయంలో నిర్వహించిన కార్యదర్శులు, విభాగాధిపతులు సమావేశంలో మాట్లాడుతూ 2022 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు అనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్ కోసం ఇప్పటికే నిర్దేశించిన 15 శాతం వృద్ధి రేటును సాధించేందుకు కూడా నిరంతరం పనిచేయాలని అన్నారు.