ఆంధ్రప్రదేశ్‌

26న నింగిలోకి పిఎస్‌ఎల్‌వి సి-35

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, సెప్టెంబర్ 19: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్)కేంద్రం నుంచి ఈ నెల 26న సముద్ర స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు క్యాట్‌శ్యాట్ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపుతున్నారు. దీంతోపాటు మరో ఏడు ఉపగ్రహాలను కూడా ఒకేమారు కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో శ్రీకారం చుట్టింది. పిఎస్‌ఎల్‌వి సి-35 రాకెట్ ద్వారా ఈ నెల 26న ఉదయం 9.20గంటలకు ఒకేమారు 8 ఉపగ్రహాలను రోదసీలోకి పంపుతున్నారు. ఈ నెల 23న ప్రయోగంపై షార్‌లో డాక్టర్ సురేష్ అధ్యక్షతన మిషన్ రెడీనెస్ రివ్యూ(ఎంఆర్‌ఆర్) సమావేశం జరగనుంది. షార్‌లోని తొలి ప్రయోగ వేదిక నుంచి జరిగే ఈ ప్రయోగ మూడు దశల అనుసంధాన పనులు పూర్తయ్యాయి. సోమవారం 4గంటలకు ఉపగ్రహ అనుసంధాన భవనం నుంచి ఉపగ్రహాల్ని షార్ డైరెక్టర్ ఉన్హికృష్ణన్ పచ్చజెండా ఊపి ప్రయోగ వేదికకు తరలించారు. రాకెట్ చివరి భాగంలో ఉపగ్రహాన్ని అమర్చే ప్రక్రియ కూడా శాస్తవ్రేత్తలు పూర్తి చేశారు. ఈ ప్రయోగంలో భాగంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా 2గంటల 50 నిమిషాలపాటు రాకెట్ వివిధ దశల్లో పయనించనుంది. మొదట రాకెట్ భూమి నుంచి నింగిలోకి వెళ్లిన అనంతరం 750 కిలోమీటర్ల దూరంలో క్యాట్‌శ్యాట్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చనుంది. అనంతరం మరలా రాకెట్ ఏభై కిలోమీటర్ల దూరం కిందకు వచ్చి భూమి చుట్టూ వివిధ దశల్లో ఒకటిన్నర గంటపాటు పయనించి మరలా 780 కిలోమీటర్ల ఎత్తులోకి వెళ్లిన అనంతరం మిగిలిన ఏడు ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చనుంది. ఈ ప్రయోగంలో ఉపగ్రహాలను రెండు పర్యాయాలు వినూత్నంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో శాస్తవ్రేత్తలు రాకెట్ రూపకల్పన చేశారు. అంతేగాక 4వ దశలో రాకెట్ ఇంజన్ రెండుమార్లు నిలిపి మరలా ప్రారంభించి అన్ని ఉపగ్రహాలను వివిధ కక్ష్యల్లోకి చేర్చనున్నట్లు చెప్పారు. ఎప్పుడూ కొత్త అధ్యయనంతో ప్రయోగాలకు శ్రీకారం చుట్టే ఇస్రో ఈసారి కూడా ప్రపంచంలో ఏ దేశం చేపట్టనివిధంగా ఈ ప్రయోగాన్ని 2.50గంటలు పయనించేలా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి రిహార్సల్స్‌ను మంగళవారం సాయంత్రం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

చిత్రం.. క్యాట్‌శ్యాట్ ఉపగ్రహం