ఆంధ్రప్రదేశ్‌

పొందూరు ఖాదీకి జాతీయ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొందూరు, సెప్టెంబర్ 19:ప్రపంచ ప్రఖ్యాతి చెందిన శ్రీకాకుళం జిల్లా పొందూరు ఖాదీకి తాజాగా రెండు జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. సోమవారం ఈ మేరకు ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ విశాఖ ప్రాంతీయ కార్యాలయం నుండి సమాచారం అందింది. ఈ నెల 22న ఈ అవార్డులు అందుకోవాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల తిరిగి ఈ అవార్డులు ఎప్పుడు అందించేది స్పష్టం చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పొందూరు ఆంధ్రాసన్న ఖాదీ కార్మికాభివృద్ధి పరిధిలో నేత పని కార్మికురాలు కోరుకొండ సరోజిని, చేనేత వడుకు ప్రక్రియ కార్మికుడు ముప్పాన శ్రీనివాసరావుకు ఈ జాతీయ అవార్డులు దక్కాయి. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చేనేత కార్మికులు చూపిన నైపుణ్యత, పటిష్టవంతమైన ప్రక్రియ నేపథ్యంలో ఈ అవార్డులు లభించాయని ఆ సంఘం అధ్యక్షుడు బస్వా రమణ, కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. నేత కార్మికులు సరోజనమ్మ, శ్రీనివాసరావును రాష్ట్ర ప్రభుత్వం విప్, ఎమ్మెల్యే కూన రవికుమార్, ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎంపిపి సువ్వారి దివ్య, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం అభినందించారు.

చిత్రం.. జాతీయ స్థాయి అవార్డులు సాధించిన సరోజిని, శ్రీనివాసరావు