ఆంధ్రప్రదేశ్‌

చిరు ధాన్యాలకు ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 13: రాయలసీమ ప్రాంతంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. కడప జిల్లా, పులివెందుల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (పుడా) అభివృద్ధి పనులపై గురువారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. శాఖల వారీగా చేపడుతున్న పనులపై ఆరా తీశారు. పులివెందులలో ప్రపంచ ప్రమాణాలతో కూడిన విద్యా సంస్థ ఏర్పాటుపై దృష్టి కేంద్రీకరించాలని టౌన్ హాల్ నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. పులివెందులలో మెడికల్ కళాశాల ఏర్పాటు స్థితి గతులను అడిగి తెలుసుకున్నారు. వైద్య కళాశాల పనులకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కేన్సర్ ఆసుపత్రి, ఇతరత్రా అభివృద్ధి పనులపై చర్చించారు. పనుల ప్రగతి, నిధుల వినియోగం అంశాలను అధికారులు వివరించారు. గ్రామాల వారీగా గోదాములు, మండలాల వారీగా కోల్డ్ స్టోరేజీలు, పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లపై మ్యాపింగ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లన్నీ ఒకే నమూనాలో ఉండాలని సూచించారు. ఈ సారి వరదలు సంభవించినప్పుడు గండికోట, చిత్రావతి ప్రాజెక్ట్‌లలో నీటి నిల్వ సామర్థ్యంపై పరిశీలన జరపాలని ఆదేశించారు. ముద్దనూరు- కొడికొండ చెక్‌పోస్టు వరకు రోడ్డు విస్తరణ పనులపై దృష్టి సారించాలన్నారు. ఖర్జూరాల పెంపకం పట్ల కొందరు రైతులు ఆసక్తి చూపుతున్నారని వాతావరణం, ఖర్చులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి
ఉంటుందని అధికారులు వివరించారు. దీనిపై ఆధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. చిరుధాన్యాల ఉత్పత్తికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఏపీ కార్ల్‌లో ఉన్న వౌలిక వసతులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని వెటర్నరీ, హార్టీకల్చర్ రంగాల్లో గొప్ప సంస్థ ఏర్పాటుకు తగిన ఆలోచనలు చేయాలని దిశానిర్దేశం చేశారు. వారం రోజుల్లో ఇందుకు తగిన ప్రణాళిక రూపొందించాలన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి