ఆంధ్రప్రదేశ్‌

లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఈ ఏడాది చివరికల్లా లక్ష ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ, జౌళిశాఖల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి వెల్లడించారు. ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో కలిపి రాష్ట్రంలోని యువతకు లక్ష మందికి ఉపాధి కల్పన దిశగా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో నాలుగో బ్లాక్ మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పారిశ్రామిక విధానం, ఉపాధి కల్పనకు సంబంధించి దృష్టి పెట్టాల్సిన కీలక రంగాలపై సమావేశంలో చర్చించారు. ఢిల్లీ, లక్నో పర్యటనల విజయవంతానికి కృషి చేసిన ఈడీబీ బృందాన్ని మంత్రి మేకపాటి అభినందించారు. ఇప్పటి వరకు సంక్షేమం దిశగా ప్రభుత్వ పాలన సాగిందని, ఇకపై పారిశ్రామికాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. అందుకు తగ్గట్టుగా ఈడీబీని మరింత పటిష్టం చేయాలని పరిశ్రమలశాఖ డైరెక్టర్‌కు మంత్రి సూచనలిచ్చారు. రాష్ట్రం తరుపున ఢిల్లీ కేంద్రంగా ప్రత్యేక ఈడీబీ బృందాన్ని నియమించే ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు.
2020-25 పారిశ్రామిక విధానంతో పెట్టుబడుల ఆకర్షణ
2020-25 పారిశ్రామిక విధానంతో పెట్టుబడుల ప్రవాహం వెల్లువెత్తేలా అధికార యంత్రాంగం జాగృతం
కావాలని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. పారిశ్రామిక వేత్తలతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి అనువైన పాలసీగా దీన్ని తీర్చి దిద్దాలన్నారు. పరిశ్రమలకు అందించే పవర్ సబ్సిడీ వివరాలు, ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉందనే విషయంపై మంత్రి ఆరా తీశారు. పెట్టుబడి దారులు పదేపదే రాష్ట్రం వైపు చూసేలా, పెట్టుబడులను ఆకర్షించేలా నూతన పారిశ్రామిక విధానం ఉండాలన్నారు. తద్వారా పారిశ్రామికాభివృద్ధి సాధించాలనేదే లక్ష్యంగా చెప్పారు. ప్రధానంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, ఆటోమోటివ్, ఆహారశుద్ధి, వస్త్ర, ఫార్మా, వ్యవసాయ, విద్య, నైపుణ్య రంగాలకు అధిక ప్రాధాన్యమివ్వాలన్నారు. సరైన సదుపాయాలు కల్పించి ప్రోత్సహిస్తే అన్ని రంగాలకు అనుకూల వాతావరణం ఉండే రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం ఖాయమని మంత్రి తెలిపారు. రంగాల వారీగా పరిశ్రమల స్థాపనకు జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఏపీఐఐసీ భూముల వివరాల లెక్క తేల్చాలన్నారు.
చక్కెర ఫ్యాక్టరీలను చక్కదిద్దాలి
రాష్ట్రంలోని చక్కెర కర్మాగారాలకు పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు సత్వర చర్యలు చేపట్టే విషయమై ప్రభుత్వ కార్యదర్శి కాంతీలాల్ దండేతో మంత్రి సమీక్షించారు. వాటిలో ఎన్ని పునరుద్ధరించాలనే విషయమై ఆరా తీశారు. చక్కెర ఫ్యాక్టరీలను చక్కదిద్దేందుకు అవసరమైన మార్గాలపై చర్చించారు. ఇతర రాష్ట్రాల్లో ఉత్పత్తి, స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ప్రభుత్వం అందించే సాయం, ఇతర వివరాలు సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ ఎండీ సుమిత్ ఫైబర్ నెట్‌పై మంత్రికి వివరించారు. ఫైబర్ నెట్‌కు వసూలు చేస్తున్న ధరల వివరాలు, చానళ్లపై చర్చించారు. సమావేశంలో పరిశ్రమలశాఖ డైరెక్టర్ రెడ్డి సుబ్రహ్మణ్యం, పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఓఎస్డీ పద్మావతి, సలహాదారులు జీవీ గిరి, లంకా శ్రీ్ధర్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన ఆటో ఫైనాన్షియల్ కార్పొరేషన్ ప్రతినిధులు
అమెరికాకు చెందిన స్టేట్ ఆటో ఫైనాన్షియల్ కార్పొరేషన్ (ఎస్టీఎఫ్‌సీ) కంపెనీ సీఐఎస్‌ఓ గ్రెగ్ టచ్చేటి, వైస్ ప్రెసిడెంట్ సురేశ్ దండు, సీటీఓ రాము లింగాల తదితర ప్రతినిధులు గురువారం సచివాలయంలో మంత్రి మేకపాటిని కలిశారు. రాష్ట్భ్రావృద్ధిలో తమ సంస్థ భాగస్వామ్యానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, ఐటీ సలహాదారు (టెక్నికల్) విద్యాసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ, జౌళిశాఖల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి