ఆంధ్రప్రదేశ్‌

మీ బస్సుయాత్ర దేనికోసం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 17 నుంచి రాష్ట్రంలో బస్సుయాత్ర చేపడతామంటూ ప్రకటించారని, అయితే ఆ యాత్ర దేనికోసమని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బస్సుయాత్ర చేపడితే ప్రజలు ఛీ కొడతారే
తప్ప ఎటువంటి ప్రయోజనం చేకూరదన్నారు. లక్షా 9 వేల కోట్లను ఒక ప్రాంతానికి ఖర్చు చేయడం వలన అభివృద్ధి కుంటుపడిందన్నారు. బస్సుయాత్ర ద్వారా ప్రజలను రెచ్చగొట్టేందుకే తప్ప ఎటువంటి అభివృద్ధి జరగదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి 13 జిల్లాలనూ అభివృద్ధి చేసేందుకు పూనుకున్నారన్నారు. అటువంటి నాయకులకు ప్రతీ ఒక్కరూ సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలన్నారు. మూడు రాజధానులతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. 8 నెలల్లో రాష్ట్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత జగన్‌కే దక్కిందన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. పింఛన్ల రద్దు విషయంలో ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నారని, అర్హులైతే 2నెలల పింఛన్లను ఒకేసారి మార్చిలో పంపిణీ చేస్తామన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని, ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ గ్రహించాలన్నారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పల నాయుడులు మంత్రితో పాటు ఉన్నారు.
*చిత్రం... విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి బొత్స