ఆంధ్రప్రదేశ్‌

హైజాక్‌ల నియంత్రణపై ఎయిర్‌పోర్టులో మాక్ డ్రిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 13: ఉగ్రవాదుల దాడులు, విమానాల హైజాక్‌కు గురయ్యే పరిస్థితులను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొనే తీరుపై విశాఖ విమానాశ్రయంలో ఐఎన్‌ఎస్ డేగ వద్ద గురువారం మాక్‌డ్రిల్ నిర్వహించారు. ఉగ్రవాదుల దాడుల నుంచి ప్రయాణికులను రక్షించడం, హైజాక్‌కు గురయ్యే విమానాలను సురక్షితంగా ఏ విధంగా కిందకు దించాలనే పలు అంశాలపై ఈ మాక్‌డ్రిల్ జరిగింది.
ప్రపంచ దేశాల్లో పలుచోట్ల ఇటీవల జరుగుతోన్న విమానాల హైజాక్ నేపథ్యంలో ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇటువంటి సంఘటనలు తలెత్తే పరిస్థితులను కళ్ళకు కట్టినట్టుగా చూపే విధంగా ఐఎన్‌ఎస్ డేగలో నిర్వహించిన మాక్‌డ్రిల్ ప్రయాణికులను విస్మయపరిచింది. మెరైన్ కమాండోలు (మార్‌కోస్), సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్), ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ), ప్రభుత్వ సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. నేవీ, ఎయిర్‌పోర్టు సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నేషనల్ సివిల్ ఎవియేషన్ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌లో భాగంగా విమానాశ్రయాల్లో సామర్థ్యాన్ని తెలియజేసేందుకు వీలుగా ఇది జరుగుతోందని సంబంధితాధికారి ఒకరు పేర్కొన్నారు.
*చిత్రం... ఐఎన్‌ఎస్ డేగ వద్ద నిర్వహించిన మాక్‌డ్రిల్