ఆంధ్రప్రదేశ్‌

త్వరలో మెగా డీఎస్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 13: రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపె విశ్వరూప్ వెల్లడించారు. గురువారం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో శిక్షణ పూర్తి చేసుకున్న 400 మంది గ్రాడ్యుయేట్ టీచర్లకు నియామకపు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో ప్రభుత్వం అనూహ్యమైన సంస్కరణలు చేపట్టిందని తెలిపారు. యువతకు పోటీ తత్వంతో కూడిన ఉపాధి కల్పనతో పాటు నైపుణ్యతా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రైవేట్‌పరం చేసి కార్పొరేట్ సంస్థల కొమ్ముకాసిందని ఆరోపించారు. గత ఐదేళ్లలో 665 ప్రభుత్వ హాస్టళ్లు మూతపడ్డాయని తమ ప్రభుత్వం వాటిని పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించటమే లక్ష్యంగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, ఈ పరిస్థితుల్లో మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహించకుండా ఉపాధ్యాయులు, అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు.

*చిత్రం... సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపె విశ్వరూప్