ఆంధ్రప్రదేశ్‌

విద్యా రంగంలో సమూల మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, ఫిబ్రవరి 13: రాష్ట్రంలో ప్రాథమిక, ఉన్నత, సాంకేతిక విద్యారంగంలో సమూల మార్పులు తీసుకువస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. గురువారం అనంతపురంలోని జేఎన్‌టీయూ ఆడిటోరియంలో రెండు రోజుల పాటు జరిగే రెండవ టెక్ వీసీల సదస్సు-2020ను మంత్రి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నాలజీని జోడించి విద్యాబోధన చేయడం ద్వారానే సాంకేతికపరంగా విద్యార్థుల్లో ఉన్నత ఆలోచనలు వస్తాయన్నారు. తద్వారా వారు ఉపాధి పొందేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నారు. రాష్ట్రంలో 60కి పైగా ప్రభుత్వ యూనివర్శిటీలు ఉండగా, అందులో కనె్వన్షనల్, డీమ్డ్, టెక్నికల్‌లాంటి పలు రకాల యూనివర్సిటీలు ఉన్నాయని, అందులో ప్రతి ఏడాది ఉత్తీర్ణత సాధించి బయటకి వచ్చిన విద్యార్థులు 75 శాతానికి పైగా ఉద్యోగాలు పొందలేకపోతున్నారన్నారు. పాత పద్దతిలో విద్యా బోధన చేయడం వల్లే ఇలా జరుగుతోందన్నారు. అందుకే ఈ విధానంలో మార్పులు తీసుకువస్తున్నామన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్లలో మార్పు కోసం రెగ్యులేటరీ, మానిటరింగ్ కమీషన్లు ఏర్పాటు చేసేందుకు బలమైన చట్టాలు రూపొందిస్తున్నామన్నారు. అలాగే డిగ్రీ స్థాయిలో బీకాం, బీఎస్సీ, బీటెక్ పూర్తయిన తర్వాత ఒక ఏడాది అప్రెంటిష్ విధానం ప్రవేశపెడుతున్నామన్నారు. విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న చర్యలో భాగంగా ఈ అప్రెంటిస్ ప్రవేశపెడుతున్నామన్నారు. ఇందులో విద్యార్థుల నైపుణ్య లోపాలను గుర్తించి వాటిని మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అప్రెంటీస్ షిప్ చేస్తున్న ఏడాదిలో విద్యార్థులకు పరిశ్రమల్లో పనిచేసేందుకు అవసరమైన ఆధునిక నైపుణ్యాలను నేర్పిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒక కాలేజి ఏర్పాటుచేసి నాణ్యమైన నైపుణ్యం నేర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జగనన్న విద్యాకానుక పథకం కింద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న విద్యార్థులకు ఉచితంగా యూనిఫాం, షూ, బ్యాగులు, పుస్తకాలు అందజేస్తున్నామన్నారు. అమ్మఒడి పథకం కింద విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రతి ఏడాది జనవరిలో రూ. 15 వే ఇస్తున్నామని, ఇందుకు పాఠశాల స్థాయిలో కనీసం 75 శాతం హాజరు ఉండాలన్నారు. అలాగే జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన కింద విద్యార్థులకు అవసరమైన వౌళిక వసతులు కల్పిస్తున్నామన్నారు. నాడు-నేడు కింద పాఠశాలలో తొమ్మిది రకాల వౌళిక వసతులు కల్పిస్తున్నామని, ప్రస్తుతం బాగా లేని పరిస్థితిని, మూడేళ్ల తర్వాత అభివృద్ధి చెందిన పరిస్థితిని ఫొటోల ద్వారా ప్రజలకు వివరిస్తామన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం విప్లవాత్మకమైన అడుగని, ఇంగ్లీష్ మీడియం వల్ల విద్యార్థులందరికీ ఒకే రకమైన, నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలల్లో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని, దీని వల్ల పేదలకు ఉన్నత విద్య అందడం లేదన్నారు. అందుకోసమే ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రారంభిస్తున్నామన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి, విద్యాశాఖ కృతనిశ్చయంతో ఉన్నాయన్నారు.

*చిత్రం... అనంతపురం జేఎన్‌టీయూలో ప్రారంభమైన 2వ టెక్ వీసీల సదస్సులో ప్రసంగిస్తున్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్