ఆంధ్రప్రదేశ్‌

అమరావతిలో తెలుగు శిలాఫలకాలకు స్థానం లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 26: నవ్యాంధ్రప్రదేశ్‌కు రాజధానిగా నిర్ణయించిన ప్రాంతానికి అమరావతిగా నామకరణం చేయటం ఎంతో సంతోషాన్ని కలుగజేసినప్పటికీ ఆ తర్వాత జరిగిన నిర్మాణం పనుల్లో ఆంగ్ల భాషతో కూడిన శిలాఫలకాలను ఆవిష్కరించడం బాధ కలిగిస్తోందని కేంద్రీయ హిందీ కమిటీ సభ్యులు, రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన నందమూరి తారక రామారావుకు ఆత్మశాంతి చేకూరే రీతిలో తెలుగులో ఏర్పాటు చేసిన రెండు శిలాఫలకాలను శనివారం తెలుగు భాషాభిమానులతో కలిసి గాంధీనగర్ ప్రెస్‌క్లబ్ నుంచి పాదయాత్రగా సిఆర్‌డిఏ కార్యాలయానికి వెళ్లి వాటిని అందజేశారు. పైగా వాటిని నెలకొల్పటానికి అవసరమైన ఖర్చుల నిమిత్తం రూ. 10వేల రూపాయల చెక్కును కూడా అందజేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ రాజధాని శంకుస్థాపన సమయంలో పూర్తిగా ఆంగ్ల భాషలో రూపొందిన శిలాఫలకాన్ని ఏర్పాటు చేసినప్పుడు భాషాభిమానులందరూ ఎంతో బాధపడ్డారన్నారు. తెలుగును అధికార భాషగా అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు కనీసం శిలాఫలకాలను కూడా తెలుగులో ఏర్పాటుచేయకపోవటం దురదృష్టకరమన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే తాను మీడియా ద్వారా అనేకమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చానన్నారు. తెలుగు, ఉర్దూ భాషకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటుచేసి ప్రత్యేక బడ్జెట్‌ను కూడా కేటాయిస్తామని వాగ్దానం చేసారని, పాలనా వ్యవహారాలన్నీ సాధ్యమైనంతవరకు తెలుగులోనే కొనసాగిస్తామన్నారన్నారు. 2015 ఆగస్టు 29న జరిగిన తెలుగు భాషా దినోత్సవ సభలో రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయా న్ని పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామని హామీ కూడా ఇచ్చారు. అయితే ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కృ ష్ణాడెల్టా పరిరక్షణ సమితి కన్వీనర్ కొలనుకొండ శివాజీ, పిసిసి అధికార ప్రతినిధి ఎన్.తులసిరెడ్డి, తెలుగు భాషాకోవిదులు డాక్టర్ సామల రమేష్‌బాబు, గోళ్ల నారాయణరావు, డాక్టర్ గుమ్మా సాంబశివరావు, డాక్టర్ వెన్నా వల్లభరావు, తదితరులు పాల్గొన్నారు.