ఆంధ్రప్రదేశ్‌

అజ్మీర్ చేరిన అమరావతి ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 16: రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, మూడు రాజధానుల ప్రకటనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరుతూ రాజధాని ప్రాంత రైతులు, మహిళలు సాగిస్తున్న ఉద్యమం రాష్ట్రం ఎల్లలు దాటుతోంది. కేవలం 29 గ్రామాలకే ఉద్యమం పరిమితం అవుతుందంటున్న వారి వ్యాఖ్యలను తోసిరాజంటూ దేశ రాజధాని ఢిల్లీ, ఇతర ప్రాంతాలకూ ఇప్పటికే చేరిన ఉద్యమం తాజాగా ముస్లింల ప్రఖ్యాత ప్రార్థనాస్థలం అజ్మీర్‌కు పాకింది. తుళ్లూరు నుండి కొందరు ముస్లిం కుటుంబాలతో సహా వెళ్లి అజ్మీర్‌లో ముస్లింలకు అన్నదానం చేశారు. ‘మూడు రాజధానులు వద్దు .. అమరావతి ముద్దు’ అంటూ ప్లకార్డులు చేతపట్టి అక్కడ నిరసన ప్రదర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మనసు మార్చుకుని మూడు రాజధానుల ప్రకటన విరమించుకుని, అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇలావుండగా తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, పెదపరిమి, ఉద్దండరాయునిపాలెం, తాడికొండ అడ్డరోడ్డు, మంగళగిరి, పెనుమాక, తదితర ప్రాంతాల్లో రాజధాని రైతులు, మహిళలు మహాధర్నాలు, రిలే దీక్షలు కొనసాగించారు. తుళ్లూరు దీక్షా శిబిరంలో చిన్నారులు, విద్యార్థులు ఖాళీ ప్లేట్లపై ‘సేవ్ అమరావతి’ అని రాసి నిరసనలు తెలిపారు. ‘జగన్ అంకుల్.. మా భవిష్యత్తును నాశనం చేయవద్దు’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీక్షా శిబిరం నుండి స్థానిక అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించిన చిన్నారులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ‘జై అమరావతి .. సేవ్ అమరావతి’ అంటూ నినాదాలు చేశారు. తాడికొండ అడ్డరోడ్డు వద్ద దీక్షలో పాల్గొన్న రైతులు అటుగా వెళ్లే వాహనాల్లోని ప్రయాణికులకు గులాబీలు పంచి అమరావతికి మద్దతుగా నిలవాలని కోరారు. ఎర్రబాలెం గ్రామంలో లూథరన్ చర్చిలో దళితులు ప్రార్థనలు నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మనసు మార్చాలని, అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని ప్రార్థనల్లో వేడుకున్నారు. మంగళగిరి పెన్షనర్స్ భవన్‌లో రాజధాని అమరావతి రైతు, కూలీల ఐక్య పోరాట వేదిక సమావేశమైంది. ఈ నెల 18న జరిగే జాతీయ రైతు నాయకుల రాజధాని పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎర్రబాలెంలో నిర్వహించిన దీక్షా శిబిరాన్ని పలువురు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. విరాళాలు అందించి తమ మద్దతు తెలిపారు.
*చిత్రం...ఖాళీ ప్లేట్లతో నిరసన తెలుపుతున్న రాజధాని ప్రాంత చిన్నారులు