ఆంధ్రప్రదేశ్‌

1129 కోట్లతో ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఆసుపత్రులకు సంబంధించి నాడు-నేడు కింద 1,129 కోట్లతో ఆరోగ్య- సంరక్షణ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. తొలిదశలో 7548 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో అంధత్వ నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మూడో విడత వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను, ఆరోగ్య కేంద్రాలను కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ఆధునీకరించేందుకు నాడు నేడు కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. ప్రస్తుత ఆసుపత్రుల బలోపేతం, అవసరమైన చోట్ల మరమ్మతులు, కొత్త ఆసుపత్రుల నిర్మాణం, సదుపాయాలను ఈ కార్యక్రమం కింద కల్పిస్తారు. 11,737 కోట్ల రూపాయలతో మూడు దశల్లో దీనిని అమలు చేయనున్నారు. తొలిదశలో ఆరోగ్య-సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. 1086 ఉప ఆరోగ్య కేంద్రాలకు భవనాలు ఉండగా, మరో 1084 కేంద్రాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో కలిసి ఉన్నాయి. ఒక్కో భవనాన్ని 23 లక్షల రూపాయలతో 4906 ఉప కేంద్రాలను నిర్మించనున్నారు. రెండో
దశలో 1907 కోట్ల రూపాయలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేస్తారు.
రాష్ట్రంలో వైద్య సేవల తీరును మెరుగుపరిచేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా అంధత్వ శాతాన్ని 1 నుంచి 0.3 శాతానికి తగ్గించేందుకు చర్యలు తీసుకోనుంది. ఈ మేరకు మూడో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మంగళవారం నుంచి అమలు చేయనుంది. కర్నూలు వేదికగా ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు. మూడో విడతలో వృద్ధులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 60 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు ఉన్న 56.88 లక్షల మందికి పరీక్షలు నిర్వహించనున్నారు. జూలై 31 వరకూ జరిగే ఈ కార్యక్రమంలో అర్హులకు శస్తచ్రికిత్సలు చేస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే స్క్రీనింగ్ జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.