ఆంధ్రప్రదేశ్‌

విద్య, వైద్యాలయాల రూపురేఖలు మారుస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఫిబ్రవరి 18: రాష్ట్రంలో విద్య, వైద్యాలయాల రూపురేఖలు మార్చాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలు నగరంలో మంగళవారం మలివిడత వైఎస్సార్ కంటి వెలుగు, నాడు-నేడు కార్యక్రమాలను జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ రానున్న మూడేళ్లలో ప్రభుత్వ విద్యాలయాలు, వైద్యశాలలను ప్రైవేటు రంగంతో పోటీపడే స్థాయికి చేరుస్తానని ధీమా వ్యక్తం చేశారు. విద్యాసంస్థల్లో ఇప్పటకే నాడు-నేడు కార్యక్రమం కొనసాగుతోందని, ఇప్పుడు వైద్యశాలలకు దాన్ని విస్తరిస్తున్నామన్నారు. విద్యాలయాల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధనకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థిని ప్రైవేటు సంస్థల్లో చదివిన విద్యార్థితో పోటీపడేలా తీర్చిదిద్దుతామని అన్నారు. ఇప్పుడున్న విద్యాలయాలను ప్రజలు ఎవరైనా ఫొటో తీసిపెట్టుకోండి, ఇప్పుడున్న వసతులు, సౌకర్యాలు, విద్యాబోధనలో నాణ్యతను గుర్తుంచుకోండి. మూడేళ్ల
తరువాత వాటిని పరిశీలించండి. మార్పు మీకే స్పష్టంగా తెలుస్తుంది అని అన్నారు. ఆధునిక, నాణ్యమైన విద్యాబోధనలో ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, ఉపాధ్యాయులకు అవసరమైన శిక్షణ ఇవ్వడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పాఠశాల్లో వసతులు మెరుగుపర్చడం, విద్యుత్, ఇంటర్‌నెట్, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించడం వంటి చర్యలు శరవేగంగా చేపడుతున్నామని సీఎం అన్నారు. ఇవన్నీ చూసి తల్లిదండ్రులు తమ చిన్నారులను ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివించాలని నిర్ణయం తీసుకుంటారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇక వైద్యశాలలకు వచ్చే రోగులకు వైద్యం అందదు, వైద్యులు ఉండరు అన్న అభిప్రాయం దూరం కానుందని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి ఆసుపత్రుల వరకు ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 16 వైద్య కళాశాలలు, 16 నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. అందుకు అవసరమైన నిధులను సమకూర్చి మూడేళ్ల తరువాత తిరిగి వెనక్కి చూస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితులు ఎదురుకాబోతున్నాయని జగన్ అన్నారు. రాష్ట్రంలో కేవలం ఎనిమిది నెలల వ్యవధిలో తాము ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చి పేద ప్రజల మన్ననలు పొందామని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోతుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు చూసి ఓర్చలేకపోతున్నారని అన్నారు. ఆయన హయాంలో జరిగిన అవినీతిని బయట పెట్టి అందుకు బాధ్యులైన వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నామని సీఎం అన్నారు. ప్రజలకు మేలు చేసి వారి ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వం శాశ్వతంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పేర్ని నాని, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కార్మిక మంత్రి జయరాం, పలువురు శాసన సభ్యులు, లోక్‌సభ సభ్యులు పాల్గొన్నారు.
*చిత్రం... మలివిడత వైఎస్సార్ కంటి వెలుగు ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి