ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో 50 వేల ఐటీ ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: వచ్చే ఏడాది కాలం లో విశాఖ కేంద్రంగా 50 వేల ఐటీ ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పష్టం చేశారు. విశాఖలో మంగళవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మానవ వనరులే పెట్టుబడిగా పరిశ్రమలకు అవసరమైన వృత్తి నైపుణ్యం కలిగిన యువతను తయారు చేయడం తమ తొలి ప్రాధాన్యంగా పేర్కొన్నారు. యువతలో వృత్తి నిపుణతను పెంపొందించేందుకు రాష్ట్రంలో ఒక స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్శిటీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో స్కిల్ కాలేజ్‌లను, నాలుగు ప్రాంతాల్లో సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 4,600 కోట్ల మేర పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలను నిలిపివేయడంపై ఆయన స్పందిస్తూ ప్రోత్సాహకాల విషయంలో గత ప్రభుత్వం సరైన విధానాన్ని అమలు చేయలేదని ఆరోపించారు. మన తాహతను బట్టి ప్రోత్సాహకాలు ఇవ్వాలని, అటువంటిది అలోచన లేకుండా ప్రకటించిన ప్రోత్సాహకాలను గత ప్రభు త్వం చెల్లించలేదన్నారు. అయితే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇచ్చే విషయంలో తాము పూర్తి పారదర్శకంగా ఉంటామన్నారు. ఇప్పటి వరకూ పెండింగ్‌లో ఉన్న పారిశ్రామిక ప్రోత్సాహకాల చెల్లింపు విషయంలో కూడా సరైన విధానాన్ని అ మలు చేస్తామన్నారు. విశాఖలో అదానీ డేటా సెం టర్ తలిపోయిందంటూ టీడీపీ చేస్తున్న విమర్శను అర్ధరహింతంగా పేర్కొన్నారు. అదానీ డేటా సెంట ర్ కేవలం రూ.3వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు మాత్రమే ప్రతిపాదనలు ఇచ్చిందన్నారు. గత ప్రభుత్వం చెప్పినట్టు రూ.70వేల కోట్ల పెట్టుబడులు పెట్టినట్టు నిరూపించాలని సవాలు విసిరారు.
విశాఖలో నేడు జరిగిన యూఎన్‌ఐడీవో, డీపీఐఐటీ సదస్సు భవిష్యత్ పారిశ్రామిక విధానానికి ఊతమిస్తుందన్నారు. యూఎస్‌ఐడీవో ఇచ్చే గ్లోబర్ సర్ట్ఫికేషన్‌తో వివిధ ప్రాంతాల నుంచి విశాఖకు పెట్టుబడులు
తరలివస్తాయన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించే వారికి జిల్లాల్లో డీఐసీలు ఫెసిలిటేటర్‌గా వ్యవహరిస్తాయన్నారు. ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈలను అభివృద్ధి చేసేందుకు మంచి అవకాశంగా పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వాలు ఇచ్చే ఇనె్సంటివ్‌ల కోసం పరిశ్రమలు పెట్టే వాటికన్నా శాశ్వత ఉత్పాదకతతో వచ్చే ప్రతిపాదనలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారికి అతి ముఖ్యమైన మనవ వనరులను అందించేందుకు విశేష ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.

*చిత్రం... విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి