ఆంధ్రప్రదేశ్‌

కట్టప్పను మించిన బానిస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), డిసెంబర్ 18: వెట్టిచాకిరీ నిర్మూలన చట్టం 1976లోనే వచ్చినా ప్యాకేజీ స్టార్ మాత్రం అందులోనుండి బయటపడలేకపోతున్నారని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసారెడ్డి విమర్శించారు. బాహుబలి సినిమాలోని బానిస కట్టప్పను మించి చంద్రబాబుకు బానిసగా ఉన్నారని మంగళవారం ట్విట్టర్‌లో పరోక్షంగా పవన్‌ను ఎద్దేవా చేశారు. చూస్తున్న ప్రజలు నవ్వుకుంటారన్న ఇంగితజ్ఞానం కూడా లేకుండా యజమానిని సమర్థిస్తున్నాడంటూ వ్యాఖ్యానించారు.
కిందా మీదా పడుతున్న బాబు మీడియా
ఐటీ దాడుల అంశంలో బాబును రక్షించేందుకు ఆయన అనుకూల మీడియా కిందా మీదా పడుతోందని విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌లో ఆరోపించారు. చంద్రబాబు పత్తిగింజ అని నమ్మించడానికి పచ్చ మీడియా ఎంతగానో ప్రయత్నిస్తోందన్నారు. 2000 కోట్ల అక్రమ లావాదేవీలను గుర్తిస్తే, కాదు రెండు లక్షల నగదు మాత్రమే దొరికిందని అబద్ధపు ప్రచారం మొదలు పెట్టారన్నారు.