ఆంధ్రప్రదేశ్‌

వైసీపీ నయవంచక పాలనపై ప్రజల్లోకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 18: అభివృద్ధి, సంక్షేమం మరిచి గత 9 నెలలుగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న నయవంచక పాలనను ప్రజాచైతన్య యాత్రల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిర్ణయించామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు పేర్కొన్నారు. ఎన్నికల ముందు అన్ని వర్గాల ప్రజల్లో ఆశలు రేపి తీరా అధికారంలోకి వచ్చాక విధ్వంస పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం మంగళగిరి సమీపంలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఏదైనా సమస్య వస్తే పోలీసులను ఆశ్రయిస్తారని, కానీ పోలీసులే అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తే పరిస్థితులు దాపురించాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ నిరంకుశ విధానాలపై పోరాడాలని నిర్ణయించామన్నారు. అనంతరం బుధవారం నుండి రాష్టవ్య్రాప్తంగా తెలుగుదేశం పార్టీ నిర్వహించ తలపెట్టిన ప్రజా చైతన్య యాత్ర కరపత్రాన్ని, స్టిక్కర్లను ఆవిష్కరించారు. ఈ యాత్ర 45 రోజుల పాటు సాగుతుందని, గ్రామ, మండల స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక చర్యలను, ముఖ్యమంత్రి జగన్ సాగిస్తున్న ప్రజాకంటక పాలనను వివరిస్తామన్నారు. ప్రకాశం జిల్లా నుండి ఈ యాత్రను బుధవారం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గురజాల మాల్యాద్రి, దారపనేని నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... ప్రజాచైతన్య యాత్ర పోస్టర్ ఆవిష్కరిస్తున్న కళావెంకట్రావు, వంగలపూడి అనిత, వర్ల రామయ్య